శ్రీదేవి విపరీతంగా మెచ్చిన పేరు అదేనా..?
పిల్లలు పుట్టినప్పుడు పేరెంట్స్ పేరు పెట్టడానికి నానా తంటాలు పడతారు. చుట్టుపక్కల వారు, బంధువులు, తోటి సహోద్యోగులు, అటు తల్లి తరపు వాళ్లు, ఇటు తండ్రి తరపు వాళ్లు.. అందరూ మెచ్చే పేర్లు పెట్టాలని తెగ తాపత్రయ పడుతుంటారు. అలా తాపత్రయ పడినవారిలో అతిలోక సుందరి శ్రీదేవి దంపతులు కూడా ఉన్నారు. 1997 సంవత్సరం మార్చ్ 6వ తేదీన జన్మించిన తొలి సంతానానికి పేరు పెట్టడానికి తెగ అలోచించారట. అలాంటి సమయంలోనే 1997లో శ్రీదేవి నటించిన ‘జుడాయి’ సినిమాలోని ఓ పాత్ర పేరుకి శ్రీదేవి బాగా కనెక్ట్ అయిందట. జుడాయి సినిమాలోని ఓ పాత్ర నుండి స్ఫూర్తి పొందిన పేరే ‘జాన్వీ’. ఆ పేరు ఇప్పుడు జాన్వీ కపూర్ గా ప్రసిద్ధి చెందుతుంది. జాన్వీ పేరు పెట్టాలని శ్రీదేవి ఎంతో ముచ్చట పడిందట. అయితే అందమైన భార్య కోరినప్పుడు ఏ భర్త అయినా కాదంటాడా.. బోణి కపూర్ కూడా ఓకే అనేసాడట. అంతేగాక జుడాయి సినిమా నిర్మాత కూడా బోణి కపూర్ కావడం విశేషం. ఇంకేముంది ముద్దుల కూతురుకి జాన్వీ కపూర్ అని పెట్టుకుంది శ్రీదేవి.
ఇక అప్పట్లో ఈ జుడాయి సినిమా భారీ హిట్. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ "శుభలగ్నం" సినిమాకు రీమేక్. ఈ సినిమాలో అనిల్ కపూర్ శ్రీదేవి ఊర్మిలా మటోండ్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన జుడాయి అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఊర్మిళ పాత్ర పేరు జాన్వీ. ‘జుడాయి’ సినిమాలోని జాన్వీ పేరుకు శ్రీదేవి, బోనీ కపూర్‌లు ఫిదా అయి.. ఫస్ట్ కూతురుకి జాన్వీ అని పేరు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి-బోణి దంపతులు తెలిపారు. ఇక శ్రీదేవి బతికుండగానే జాన్వీని హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడింది. కానీ కూతురి సినిమా విడుదల కాకముందే ఆమె లోకాన్ని విడిచివెళ్ళింది. ఆ తర్వాత ‘దడఖ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో జాన్వీ ఇంట్లోనే ఉంటోంది.