శ్రీరెడ్డిని పెట్రోలు పోసి తగలబెడతామంటూ!
వివాదాస్పద నటి శ్రీరెడ్డి పరిచయం అవసరం లేదు. నిత్యం వివాదాలతో అంటగాగడం వాటిని యూట్యూబ్ లో వైరల్ చేయడం తనకో హాబీ. స్టార్లపై ఆరోపణలు గుప్తిస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అందరిపైనా ఆరోపణలు చేసి చివరిగా చెన్నై వెళ్లి స్థిరపడింది. హైదరాబాద్ కు దూరమైనా అప్పుడప్పుడు టాలీవుడ్ స్టార్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ ఇక్కడ తన అభిమానులకు టచ్ లో ఉంటుందనుకోండి. ఈ పరంపరలోనే తెలుగు నటి కరాటే కళ్యాణి తోనూ శ్రీరెడ్డి వాగ్వివాదినికి దిగింది.
ఇంతకుముందు కరాటే కళ్యాణి .. శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు పెట్టారని కరాటే కళ్యాణి.. డాన్స్ మాస్టర్ రాకేష్ పై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయంలో కళ్యాణి- రాకేష్ లు తనని చంపడానికి వ్యూహ రచన చేస్తున్నారని... పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరించారని ఫిర్యాదు చేసింది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ మీడియా అటెన్షన్ కోసం శ్రీరెడ్డి చేసే పనుల గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఆధారాల్లేని ఆరోపణలతో ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో కుంపటి పెట్టింది. ఈ నేపథ్యం లో తాజా ఫిర్యాదు కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ లా ఉందని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. తన ఫేస్ బుక్ పేజీలో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారని.. అందుకే ఇలాంటి చెడు ప్రచారాలకు దిగుతోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై కరాటే కళ్యాణి కానీ... డాన్స్ మాస్టర్ రాకేష్ కానీ ఇంకా స్పందించలేదు. వాళ్లు లైన్ లోకి వస్తే అసలు బండారం బయటపడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.