• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవుడికి కృతజ్ఞతలు.. వలస...

దేవుడికి కృతజ్ఞతలు.. వలస కార్మికుల పై ఓ పుస్తకం రాస్తాను: సోనూసూద్

By - Tupaki Desk
Update: 2020-07-15 07:50 GMT
సినీనటుడు సోనూసూద్ అంటే ప్రస్తుతం దేశంలో ఆయన ఓ నటుడు మాత్రమే కాదు. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి, కన్నీళ్లు తుడిచే మనస్తత్వం.. సేవాగుణం కలిగిన రియల్ హీరో. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్స్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి వలస కార్మికులకు, పేదలందరికీ ఉచితంగా ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ ను పొడిగించినా పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని చెబుతున్నాడు. సోనూసూద్ మంచి మనసుతో చేసిన పని ఇది. వలస కార్మికుల కష్టాలు ఎరిగిన మనిషి.

ఈ నేపథ్యంలో ఉపాధి లేక చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ఆయన రవాణా సౌకర్యం కల్పించాడు. "ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడుతున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడు తమ కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే దేనితోనైనా పోరాడగలడనేది ఆయన నమ్మకం" అంటూ ఆశించాడు.

'పిల్లలు, వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం తరుక్కుపోయింది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లోని వలస కార్మికులకు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఓ సందర్భంలో సోనూసూద్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఛారిటీ సహాయంతో ఇప్పటి వరకు కొన్ని వేల మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరినట్లు తెలుస్తుంది. "కేవలం ఒక్కడి తపన.. సంకల్పం అంతమందికి బతుకు బాట చూపించింది" అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనియాడాయి.

అయితే తాజాగా సోనూసూద్.. వలస కార్మికులతో తన అనుభవాలను ఓ పుస్తకంగా మలచాలని.. తానే స్వయంగా లాక్ డౌన్ సమయంలో కార్మికులతో గంటలుగంటలుగా గడిపిన ఆ క్షణాలను.. వారు బస్సు ఎక్కి సొంతింటికి వెళ్తున్నామని ఆనందంతో చూసిన ఆ చూపులు.. అన్నీ నా మనసు నింపేసాయి. ఈ మూడున్నర నెలల సమయం నా జీవితంలో ఎన్నో అనుభవాలను మిగిల్చింది. వలస కార్మికులకు సహాయం చేసే అవకాశం ఇచ్చిన ఆ దేవుడుకి నా కృతజ్ఞతలు. వలస కార్మికులతో నా అనుభవాలను కథలుగా ఓ పుస్తకం రాస్తాను. ఆ  పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందని సోనూసూద్ వెల్లడించాడు.
Tags:    
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily Ne 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS