పుష్ప నుండి బుట్టబొమ్మ తరహా సాంగ్ !!

Update: 2021-09-04 09:30 GMT
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 1 సినిమా నుండి ఇప్పటికే మొదటి పాట వచ్చి అందరిని ఆకట్టుకుంది. మాస్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యేలా ఉన్న మొదటి పాట భారీగా వ్యూస్ ను దక్కించుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ చాలా పట్టుదల కసితో ఈ సినిమా పాటలను ట్యూన్ చేస్తున్న విషయం తెల్సిందే. మొదటి పాటతో ఆ విషయం నిరూపితం అయ్యింది. ఇక రెండవ పాట కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్‌ 1 ను డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నారు కనుక రెండవ పాటను అక్టోబర్ కు ముందే అంటే ఈ నెల చివర్లోనే విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పుష్ప నుండి రాబోతున్న రెండవ పాట బన్నీ.. రష్మికల మద్య సాగే ఒక లవ్ కమ్‌ రొమాంటిక్ సాంగ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అల వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మ పాట ఎలా ఉంటుందో పుష్ప నుండి రాబోతున్న రెండవ పాట కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. దేవి శ్రీ మార్క్ తో పాటు బన్నీ స్టైల్‌ స్టెప్పులు ఉండేలా పాటను డిజైన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొదటి పాటను అయిదు భాషల్లో అయిదుగురు ప్రముఖ సింగర్స్ తో పాడించడం జరిగింది. ఇప్పుడు రెండవ పాటను కూడా అయిదు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్‌ ల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మ్యూజికల్‌ గా సక్సెస్ ను దక్కించుకున్నాయి. కనుక ఈ సినిమా పాటలు కూడా ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటాయనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇప్పటికే విడుదల అయిన పాట సక్సెస్‌ అవ్వడంతో రెండవ పాట కూడా ఖచ్చితంగా సూపర్ హిట్‌ అవుతుందనే నమ్మకంను ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుండి బుట్టబొమ్మ పాట సందడి చేస్తూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో బుట్టబొమ్మకు మంచి పేరు వచ్చింది. కనుక పుష్ప నుండి రాబోతున్న రెండవ పాట కూడా అదే రేంజ్ లో ఉండి మాస్ క్లాస్ ను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News