పిక్‌ టాక్‌ : తండ్రితో ఇలాగేనా రావడం?

Update: 2020-02-08 03:30 GMT
హీరోయిన్స్‌ కాస్ట్యూమ్స్‌ గురించి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో పదే పదే ట్రోల్‌ అవుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్స్‌ మోడ్రన్‌ డిజైన్డ్‌ కాస్ట్యూమ్స్‌ ధరించడం తప్పులేదు. కాని సమయం సందర్బంను బట్టి వారి కాస్ట్యూమ్స్‌ ఉండాలని చాలా మంది అంటున్నారు. అలా సమయం సందర్బంను బట్టి కాస్ట్యూమ్స్‌ ధరించని వారిని ట్రోలర్స్‌ సోషల్‌ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ను ట్రోల్స్‌ తో నెటిజన్స్‌ ఏకిపడేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే ఆధిత్య రాయ్‌ కపూర్‌ ఇంకా దిశా పటానీ హీరో హీరోయిన్‌ గా రూపొందిన ‘మలాంగ్‌’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీవ్యూ షోను నిన్న ముంబయి లో సినీ సెలబ్రెటీల కోసం వేయడం జరిగింది. కత్రీనా కైఫ్‌.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకా పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ తో పాటు ఇంకా పలువురు హాజరు అయ్యారు. మలాంగ్‌ లో కీలక పాత్రను పోషించిన అనీల్‌ కపూర్‌ తన కూతురు సోనం కపూర్‌ తో కలిసి ప్రీమియర్‌ కు హాజరు అయ్యాడు.

ఈ సమయంలో సోనం కపూర్‌ ధరించిన కాస్ట్యూమ్స్‌ పై విమర్శలు మొదలయ్యాయి. తండ్రితో ప్రీమియర్‌ కు వస్తున్న సమయంలో కాస్త పద్దతిగా డ్రస్‌ అవ్వాలనే కామన్‌ సెన్స్‌ లేదా అంటూ సోనంపై కామెంట్స్‌ చేస్తున్నారు. ఛాతి భాగం సగం వరకు బయటకు కనిపించే డ్రస్‌ ను వేసుకుని తండ్రి తో ఎవరైనా ఇలాంటి కార్యక్రమం లో హాజరు అవుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్స్‌ ఇలాంటివి ధరించవచ్చు.. కాని కుటుంబ సభ్యులతో కార్యక్రమాలకు హాజరు అయిన సమయం లో కొన్ని కండీషన్స్‌ ను వారికి వారు విధించుకుంటే మంచిదని.. సోనమ్‌ కపూర్‌ ఇకపై అయినా ఇలాంటి చెత్త డ్రస్‌ లు వేసుకుని తండ్రి తో కనిపించవద్దంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News