అదిరే పోజులో వయ్యారాలు పోతున్న బాలీవుడ్ సుందరి!!

Update: 2021-01-04 10:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్యూటీ సోనాక్షి సిన్హా సినీప్రియులకు సుపరిచితమే. ఈ భామ దబాంగ్ సినిమాలో ఉన్నట్లు అదే కట్టుబొట్టుతో సంప్రదాయంగా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. దబాంగ్.. లుటేరా సినిమాలలో చీరకట్టిన సోనాక్షిని.. ఫ్యాషన్ దుస్తులలో చూస్తూ షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన సోనాక్షి. యంగ్ హీరోలతో సైతం రొమాన్స్ చేయడానికి రెడీ అంటోంది. మొదట్లో అంత పద్ధతిగా కనిపించిన ఈ భామ.. ఇప్పటికి అలాగే ఉంటుందని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్.. అంటే ఎక్కువకాలం చుడిదార్.. సారీ.. లాంటివి ఎక్సపెక్ట్ చేయకూడదు.

కెరీర్ ప్రారంభంలో నడుం చూపించడానికి కూడా నో చెప్పిన బ్యూటీ.. ప్రస్తుతం పొట్టి పొట్టి దుస్తులతో తన మేని సౌందర్యం అంతా ప్రదర్శిస్తోంది. ఇక బెడ్ సీన్స్.. లిప్ లాక్స్.. రొమాన్స్ ఇవన్నీ కామన్. చేసింది తక్కువ సినిమాలే కానీ నటిగా మంచి పేరుతో పాటు అదే రేంజిలో కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటుంది సోనాక్షి. ఇక సోషల్ మీడియాలో అమ్మడికి మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. మ్యాగజైన్స్ కోసం ఎన్ని అందాలైన కెమెరా ముందు నిలపడానికి వెనుకాడదు. ఇటీవలే కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఓ రేంజ్ డ్రెస్సింగ్ స్టైల్ లో మెరిసింది. తాజాగా అమ్మడు బ్లాక్ అవుట్ ఫిట్ లో వయ్యారాలుపోతూ పోజిచ్చింది. ప్రస్తుతం వేకెషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తూనే ఎప్పటికప్పుడు తన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో అమ్మడు సన్ సెట్ టైంలో ఇచ్చిన పోజుతో పాటు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
Tags:    

Similar News