డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న మెగా మేనల్లుడి మూవీ..?

Update: 2020-11-03 16:50 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ''సోలో బ్రతుకే సో బెటర్''. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ మరియు లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ పొందింది. అయితే ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో మూవీస్ అన్నీ డైరెక్ట్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' చిత్రాన్ని కూడా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పుడు ముందుగా థియేట్రికల్ రిలీజ్ చేసి ఆ తర్వాత డిజిటల్ రిలీజ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. 'చిత్రలహరి' 'ప్రతిరోజు పండగే' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక హీరోయిన్ న‌భా న‌టేశ్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. 'డిస్కోరాజా' ప్లాప్ తర్వాత న‌భా నటిస్తున్న ఈ సినిమా రిజల్ట్ పై ఆమె కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మరి సాయి తేజ్ - న‌భా లకు 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News