ఏ హ‌డావుడి లేకుండా గాయ‌ని సునీత నిశ్చితార్థం?

Update: 2020-12-07 07:25 GMT
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ సునీతకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మేటి గాయ‌నిగా త‌న సుమ‌ధుర గాత్రంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ప్ర‌తిభావ‌ని. రెండు ద‌శాబ్ధాలుగా స్టార్ సింగ‌ర్ ‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమె మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గ‌త కొంత కాలంగా మీడియా క‌థ‌నాలు వినిపించ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.

ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని సునీత కొట్టి పారేస్తున్నా ప‌దే ప‌దే అవే వార్త‌లు వేడెక్కించాయి. క‌నీసం నెల‌కోసారి సునీతపై క‌థ‌నాలొచ్చాయి. తాజాగా ఆమె మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. గాయ‌నిగా మంచి క్రేజ్ ని తెచ్చుకున్న సునీత మ‌ళ్లీ పెళ్లిచేసుకోబోతున్నార‌‌ని.. సీక్రెట్ ‌గా  కుటుంబ స‌భ్యుల అనుమ‌తితో నేడు (సోమ‌వారం) ఎంగేజ్ ‌మెంట్ చేసుకున్నార‌ని తెలిసింది.

సునీత వివాహం చేసుకోబోయేది ఓ మీడియా హౌస్ చైర్మ‌న్ ‌ని అని తెలుస్తోంది. సోమ‌వారం ఎంగేజ్ ‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గాయ‌ని సునీత‌కు గ‌తంలో వివాహం జ‌రిగింది. టీవీ ప్రొడ్యూస‌ర్ కిర‌ణ్ ని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనంత‌రం అభిప్రాయ బేధాల కార‌ణంగా విడిపోయారు. 
Tags:    

Similar News