చిన్మయి ఎఫెక్ట్‌.. ఆ జంట విడాకులు

Update: 2019-06-16 05:52 GMT
మీటూ ఉద్యమం ఎంతో మంది స్టార్స్‌ కు సెలబ్రెటీలకు గత ఏడాది కంటిమీద కునుకు లేకుండా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీటూ ఉద్యమం కారణంగా ఎంతో మంది ప్రముఖులు కూడా ఆఫర్లు లేక రోడ్డున పడ్డాడరు. మరి కొందరు పరువు పోయి బయటకు రాలేకుండా ఉన్నారు. ఇదే క్రమంలో సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు అయిన చిన్మయి చేసిన మీటూ ఆరోపణల కారణంగా ఒక సంగీత దర్శకుడి కాపురంలో చిచ్చు రేగింది.  ఆ సంగీత దర్శకుడి భార్య విడాకుల వరకు వెళ్లింది.

చిన్మయి కొన్నాళ్ల క్రితం కన్నడ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక సారి ఆఫర్‌ కోరితే ఇంటికి రమన్నాడు అంటూ రఘుపై చిన్మయి వ్యాఖ్యలు చేసింది. ఇక తన స్నేహితురాలు అయిన ఒక సింగర్‌ తో రఘు దీక్షిత్‌ రికార్డింగ్‌ స్టూడియోలో అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్మయి ఆరోపణలను రఘు దీక్షిత్‌ ఒప్పుకున్నాడు. ఒక పాట రికార్డింగ్‌ సమయంలో భావోద్వేగంతో సింగర్‌ ను హగ్‌ చేసుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాను. అయితే ఆ సమయంలోనే ఆమెకు క్షమాపణలు చెప్పాను, ఇప్పుడు కూడా ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చాడు.

అప్పటి నుండి కూడా ఆయన కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. రఘు భార్య అప్పటి నుండి కూడా వివాదం పెట్టుకుంటూ ఉందట. ఇరు కుటుంబ సభ్యులు ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా సఫలం కాలేదట. వీరిద్దరు కూడా ఇక కలిసి ఉండటం కష్టం అనుకుని బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు ధరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరి విడాకుల కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News