అలాంటి వాడిని గొప్పవాడిగా చెప్పుకోవడం మన ఖర్మ

Update: 2020-03-28 14:30 GMT
ప్రముఖ గాయని.. డబ్బింగ్‌ ఆర్టిస్టు చిన్మయి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. మీటూ ఉద్యమం పీక్స్‌ లో ఉన్న సమయంలో ఈమె తమిళ లెజెండ్రీ రచయిత వైరముత్తుపై చేసిన ఆరోపణలు ఏ స్థాయిలో ప్రకంపనలు పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మందిని కూడా ఆయన లైంగికంగా వేదించాడంటూ వారందరి వివరాలు కూడా తనవద్ద ఉన్నాయంటూ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల కారణంగా ఆమెను అనధికారికంగా తమిళ ఇండస్ట్రీ బహిష్కరించినట్లుగా కూడా ప్రచారం జరిగింది.

ఎక్కడ లైంగిక వేదింపులు జరిగినా ఎక్కడ ఆడవారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా వార్తలు వచ్చినా కూడా వెంటనే సోషల్‌ మీడియాలో స్పందించే చిన్మయి మరోసాయి ఒక విషయంపై స్పందించింది. ప్రముఖ చీలి దేశపు రచయిత పాబ్లో నెరుడా తన ఆత్మకథలో శ్రీలంక వెళ్లిన సమయంలో ఒక తమిళ మహిళను రేప్‌ చేసినట్లుగా పేర్కొన్నాడు. ఆ విషయంలో ప్రస్తుతం తాను పశ్చాతాప పడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

నోబెల్‌ బహుమతి దక్కించుకున్న నెరుడా ఇలాంటి వ్యక్తి అంటూ చిన్మయి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. ఇలాంటి వ్యక్తులను మనం గొప్ప వ్యక్తులుగా గౌరవిస్తూ అవార్డులు ఇస్తూ సమాజంలో ప్రముఖులుగా చూస్తున్నాం. ఇది మన ఖర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రేప్‌ చేశానంటూ నిసిగ్గుగా అతడు చెప్పడం మహిళలపై ప్రస్తుతం జరుగుతున్న లైంగిక దాడులకు నిదర్శణంగా చెప్పుకోవచ్చు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News