మాల్దీవుల్లో సముద్రం అడుగున శ్రద్ధా స్కూబా డైవింగ్
మాల్దీవుల్లో బాలీవుడ్ టాలీవుడ్ తారల అండర్ వాటర్ విహారం గురించి తెలిసిందే. ఇంతకుముందు కాజల్ - కిచ్లు జంట.. సమంత- నాగచైతన్య జంట సముద్రం అడుగున స్కూబా డైవింగ్ ని ఎంజాయ్ చేశారు. కాజల్ -కిచ్లు జోడీ ఏకంగా సముద్రంలోనే హనీమూన్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. కియరా-సిద్ధార్థ్ జంట మాల్దీవుల్లో సీక్రెట్ యాత్రను కంటిన్యూ చేయగా.. సారా అలీఖాన్ ఇటీవల మాల్దీవుల విహారంలో తన సోదరుడితో కలిసి యాత్రను కొనసాగించారు.
ఇప్పుడు సాహో శ్రద్ధా కపూర్ వంతు. ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల విహారంలో ఉన్నారు. తన అభిమానులను కట్టిపడేసేలా సోషల్ మీడియాలో వరుస ఫోటోలను వీడియోలను షేర్ చేశారు శ్రద్ధా. నీటి అడుగున స్కూబా డైవింగ్ చేస్తున్న ఫోటోలు వీడియో హైలైట్. `లైఫ్ అండర్ వాటర్` అంటూ స్నీక్ పీక్ ని శ్రద్ధా షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఈ విహారయాత్రలో శ్రద్ధా తండ్రి.. నటుడు శక్తి కపూర్ .. తల్లి శివంగి పురే తనతోనే ఉన్నారు. విహార యాత్ర నుండి అనేక ఫోటోల సముదాయాన్ని షేర్ చేయడంతో అవి శ్రద్ధా అభిమానులకు ప్రధాన ప్రయాణ లక్ష్యాలను నిర్ధేశిస్తున్నాయి. ఇక సముద్రంలో స్కూబా డైవింగ్ సాహసం మైమరిపిస్తోంది. నీటి అడుగున వీడియో క్లిప్ లో అనేక జలరాశులు కనిపిస్తున్నాయి. సముద్రంలో కొన్ని డాల్ఫిన్ లు శ్రద్ధాతో ఆడుకుంటున్న వీడియో ఆకట్టుకుంది.
శ్రద్ధా ఇటీవలే తన 34 వ పుట్టినరోజును జరుపుకున్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. మాల్దీవులలో షాజా మొరానీతో కలిసి తన కజిన్ సోదరుడు.. నటుడు ప్రియాంక్ శర్మ వివాహ ఉత్సవాన్ని కూడా ఆస్వాధించింది. తన స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధా అక్కడ ప్రత్యక్షమవ్వడంతో త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ ప్రచారం మొదలైంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.., శ్రద్ధా చివరిసారిగా స్ట్రీట్ డాన్సర్ 3 డి .. బాఘి 3 చిత్రాల్లో కనిపించింది. తరువాత రణబీర్ కపూర్ తో కలిసి లవ్ రాంజన్ దర్శకత్వం వహించిన ఒక రొమాంటిక్ డ్రామాలో కనిపించనుంది. రణబీర్- శ్రద్ధ మొదటిసారి జంటగా నటిస్తున్నారు.