తెలుగు తెరకి ముందుగా పరిచయమై ఇక్కడ ఆశించినస్థాయి అవకాశాలు లేకపోవడం వలన, ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో సునైన ఒకరిగా కనిపిస్తుంది. తెలుగులో సునైన కొన్ని చిన్న సినిమాలు చేసింది.
ఆ సినిమాలు ఆడింది కూడా అంతంత మాత్రమే. అలా ఆ జాబితాలో 'టెన్త్ క్లాస్' .. ' పెళ్లికి ముందు ప్రేమకథ' సినిమాలు కనిపిస్తాయి. ఆమెకి కాస్త పేరు తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది 'రాజరాజచోర మాత్రమే.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆమె ఆయన సరసన నాయికగా అలరించింది. ఈ సినిమా సక్సెస్ ఆ అయిందిగానీ, సునైన గురించి ఎవరూ మాట్లాడుకో లేదు. అంతగా ఆమె పాత్ర కనెక్ట్ కాలేదనే చెప్పుకోవాలి.
ఈ సినిమా చేసే సమయానికే సునైనా తమిళంలో వరుసగా చాలా సినిమాలు చేసింది.'రాజ రాజ చోర' తరువాత తెలుగులో కూడా తాను బిజీ అవుతానని ఆమె అనుకుంది గానీ అలా జరగలేదు. దాంతో ఆమె మళ్లీ తమిళ సినిమాలనే చేస్తూ వెళుతోంది. విశాల్ సరసన ఆమె చేసిన 'లాఠీ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆమె 'రెజీనా' అనే సినిమా చేసింది. ఇది నాయిక ప్రధానమైన సినిమా. స్టైలీష్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమైంది. సతీశ్ నాయర్ నిర్మించిన ఈ సినిమాకి డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. ఒక సాధారణమైన గృహిణి కొన్ని కారణాల వలన అసాధారణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరిస్థితులు ఏమిటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే ఆసక్తికరమైన సంఘటనలతో కథ మలుపులు తీసుకుంటుంది.
తమిళంతో పాటు ఈ సినిమా తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ తెచ్చిపెడుతుందని నమ్మకంతో సునైన ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే తనకి మిగతా భాషల నుంచి కూడా అవకాశాలు వస్తాయని ఆమె ఆశపడుతోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.