లాక్‌ డౌన్‌ లో సూపర్‌ స్టార్‌ ఎక్కువ సమయం కిచెన్‌ లోనే గడిపాడట!!

Update: 2020-09-30 03:30 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ లాక్ డౌన్‌ ప్రకటించినప్పటి నుండి రెండు మూడు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఏడాదిలో కొత్త సినిమాను కూడా మొదలు పెట్టే ఆలోచన ఆయనకు లేదని క్లారిటీ వచ్చేసింది. అట్లీ కుమార్‌ దర్శకత్వంలో వచ్చే ఏడాదిలో షారుఖ్‌ ఖాన్‌ కొత్త సినిమా మొదలయ్యే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. ఈ లాక్‌ డౌన్‌ లో షారుఖ్‌ ఏం చేస్తూ ఉంటాడు అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు. వారి ప్రశ్నలకు షారుఖ్‌ సతీమణి గౌరీ ఖాన్‌ సమాధానం ఇచ్చారు.

ఇటీవల ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ లాక్‌ డౌన్‌ టైంను షారుఖ్‌ పూర్తిగా కుటుంబంతోనే టైం స్పెండ్‌ చేస్తున్నారు. ఎక్కువ శాతం ఆయన మా అందరి కోసం ప్రత్యేకంగా వంటలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా ఆయన మా కోసం ప్రత్యేకంగా కిచెన్‌ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు అంటూ గౌరీ ఖాన్‌ అన్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన కుకింగ్‌ ను ఆయన ఈమద్య చాలా ఎక్కువగా చేశారంటూ తన భర్త వంటల ముచ్చట్లు చెబుతూ గౌరీ ఖాన్‌ ముసి ముసి నవ్వులు నవ్వారు. ఇంకా చాలా మంది స్టార్స్‌ కూడా ఈ లాక్‌ డౌన్‌ టైంలో ఎక్కువగా కిచెన్‌ లోనే గడుపుతున్నారనే విషయం తెల్సిందే.
Tags:    

Similar News