బ్రూస్ లీని కలిసిన బాద్ షా

Update: 2015-10-06 15:40 GMT
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. ఈ మధ్య సర్ ప్రైజ్ విజిట్స్ తెగ ఇచ్చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ ది ఫైటర్ ని శరవేగంగా షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా బ్రూస్ లీ అంటూ సాగే టైటిల్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ పాటు షూట్ చేస్తున్నపుడు షారూక్ సడెన్ గా బ్రూస్ లీ సెట్స్ కి వచ్చేశాడు.

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ వేస్తున్న మెస్మరైజింగ్ స్టెప్స్ ని ఇంట్రస్టింగ్ గా గమనించాడు షారూక్. ఇద్దరి పెయిర్, కెమిస్ట్రీ బాగుందని ప్రశంసించాడట బాలీవుడ్ బాద్ షా. కాసేపు ఇద్దరితోనూ కూర్చుని కబుర్లాడ్డమే కాకుండా.. చెర్రీ ప్రాజెక్ట్స్ పై కూడా ఆరా తీసినట్లుగా బ్రూస్ లీ యూనిట్ వర్గాలు చెబ్తున్నాయి.

షారూక్ ఇలా సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్ గా బ్రహ్మోత్సవం సాంగ్ షూటింగ్ సమయంలో ఇలాగే వచ్చి, మహేష్ బాబు కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాడు. అంత పెద్ద హీరో అయినా ఏ భేషజం లేకుండా.. పిలవలేదని కూడా భావించకుండా నేరుగా వచ్చి ఇలా పలకరిస్తుండడంతో.. షారూక్ ఖాన్ గొప్పదనాన్ని తెగపొగిడేస్తున్నారు టాలీవుడ జనాలు.
Tags:    

Similar News