బతుకు చీక‌టి వెలుగుల దోబూచులాట.‌. నీకు నువ్వే లాంత‌రు!

Update: 2021-01-02 06:30 GMT
బుల్లితెర యాంక‌ర్ కం న‌టి షామా శికంద‌ర్ అడ్డూ ఆపూ లేని ఫోటోషూట్ల‌ పై వివ‌ర‌ణ‌లు అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు గ‌త కొంత‌కాలంగా వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిన‌దే. ఇంత‌కుముందు మాల్దీవుల నుంచి వేడెక్కించే బికినీ బీచ్ ఫోటోల‌తో విరుచుకు ప‌డిన షామా లేటెస్టుగా ఇండోర్ ఫోటోషూట్ తోనూ అగ్గి రాజేస్తోంది. ఇటీవ‌లే బికినీ బీచ్ లో న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ తోనూ త‌న‌దైన శైలిలో హీట్ పెంచింది.

తాజాగా కిచెన్ ఫోటోషూట్ మైమ‌రిపిస్తోంది. హాలీవుడ్ స్టార్లు పాప్ స్టార్ల‌కే మ‌తి చెడేలా షామా ఇచ్చిన ఫోజు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. అస‌లు హ‌ద్దులు చెరిపేసేలా గ్లామ‌ర్ షోకి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఈ అమ్మ‌డు ఫీల‌ర్స్ వ‌దులుతోంది. థై సొగ‌సుల ఎలివేష‌న్ లో త‌న‌ని కొట్టేవాళ్లే లేర‌ని ఫీల‌వుతోంది. షామాకు హిందీ బుల్లితెర‌తో పాటు వెండితెర అవ‌కాశాలు ఇటీవ‌ల వెల్లువెత్తుతున్నాయ‌ని స‌మాచారం.

ఇంత‌గా శ్ర‌మిస్తున్నందుకైనా సౌత్ పిలిచి అవ‌కాశం ఇస్తుందేమో చూడాలి. ఇటీవ‌ల నెమ్మదిగా షూటింగులు ఊపందుకుంటున్నాయి. దాదాపు 100 సినిమాలు చిత్రీక‌ర‌ణ‌ల్లో ఉన్నాయి. వీటిలో ఎక్క‌డైనా ఐటెమ్ నంబ‌ర్ కి అయినా అవ‌కాశం లేక‌పోతుందంటారా?  జీవితం చీక‌టి వెలుగుల దోబూచులాట‌. నీకు నువ్వే లాంత‌రు! అంటూ అమ్మ‌డు అద్భుత‌మైన క‌విత‌ల్ని అల్లుతోంది.
Tags:    

Similar News