ఒక మామూలు నేపథ్యం నుంచి వచ్చిన హీరో అతను. ఆస్తుల్లేవు.. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. మరీ పెద్ద చదువులేమీ చదువుకోలేదు. నటన మీద మక్కువతో ఒక టీవీ కార్యక్రమంతో వెలుగులోకి వచ్చాడు. తర్వాత సినీ అరంగేట్రం చేశాడు. హీరో అయ్యాడు. స్టార్ గా ఎదిగాడు. సూపర్ స్టారూ అయ్యాడు. కేవలం నటనకు పరిమితం అయిపోకుండా ప్రకటనలు చేశాడు. సినీ నిర్మాణంలో అడుగుపెట్టాడు. ఇంకా అనేక వ్యాపారాలు చేశాడు. ఇప్పుడతడి ఆస్తుల విలువ చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. ఏకంగా రూ.3900 కోట్లకు పైనే లెక్క తేలుతోంది. ఇంతకీ ఎవరా హీరో అంటారా.. ఇంకెవరు బాలీవుడ్ బాద్షా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.
ఓ మీడియా సంస్థ షారుఖ్ ప్రస్తుత ఆస్తుల విలువను లెక్కగట్టింది. అది దాదాపు 600 మిలియన్ డాలర్లుగా తేల్చింది. అంటే రూపాయల్లో రూ.39,791,970,000 అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన నటుల జాబితాలో షారుక్ ది రెండో స్థానం కావడం విశేషం. ఇండియాలో అతనే రిచెస్ట్. ఒక సినీ నటుడు ఆస్తులేమీ లేకుండా తన టాలెంటుతో 3900 కోట్లకు పైగా ఆర్జించడం మామూలు విషయం కాదు. కేవలం సినిమాలకు పరిమితం కాకుండా.. యాడ్స్ ద్వారా కూడా భారీగా ఆర్జించడం.. సినిమాలు నిర్మించడం.. ఐపీఎల్ జట్టును సొంతం చేసుకుని భారీగా ఆర్జించడంతో షారుఖ్ ఆస్తుల విలువ ఈ స్థాయికి చేరుకుంది. షారుఖ్ ను కింగ్ ఖాన్ అని ఎందుకంటారో ఈ లెక్కలతో మరోసారి రుజువైంది.