తమన్నా తెలంగాణ.. గోపీచంద్‌ ఆంధ్రా

Update: 2020-04-08 05:00 GMT
తమన్నా కెరీర్‌ ఎండ్‌ అయ్యిందని.. ఆమె ఇక మెల్ల మెల్లగా కనుమరుగవ్వాల్సిందే. గత కొంత కాలంగా ఆమె పూర్తిగా ఖాళీగా ఉంటుంది అంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తమన్నా మాట్లాడుతూ తాను ఖాళీగా ఉంటున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. నేను సంవత్సరంలో 365 రోజులు బిజీగానే ఉంటున్నాను. వరుసగా పలు ప్రాజెక్ట్స్‌ చేస్తూనే ఉన్నాను. నేను ఖాళీగా ఉన్నాను అనుకుంటున్న వారు ఖాళీగా ఉండవచ్చు అంటూ కామెంట్‌ చేసింది.

తాను సౌత్‌ సినిమాలతో పరిచయం అయ్యాను కనుక నా మొదటి ప్రాముఖ్యత ఎప్పుడైనా కూడా సౌత్‌ సినిమాకే ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఈ అమ్మడు నటిస్తున్న ‘సీటిమార్‌’ చిత్రం గురించి మాట్లాడుతూ నేను మొదటి సారి ఒక క్రీడా నేపథ్యం గల సినిమాలో నటిస్తున్నాను. ఒక అమ్మాయిని అవ్వడం వల్లో ఏమో కాని ఇప్పటి వరకు నాకు ఏ గేమ్‌ తో టచ్‌ లేదు. మొదటి సారి ఈ చిత్రం కోసం కబడ్డీ ఆట నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలో తాను తెలంగాణ రాష్ట్ర స్థాయి జట్టుకు కోచ్‌గా కనిపించబోతున్నాను. గోపీచంద్‌ ఆంధ్ర జట్టు కబడ్టీ జట్టుకు కోచ్‌ గా కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ పాత్ర నాకు చాలా ఛాలెంజ్‌ ను విసిరిందని కష్టపడి చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం క్వారెంటైన్‌ లో ఉన్న ఈమె ఫిజిక్‌ పై శ్రద్ద పెట్టడంతో పాటు పలు కొత్త విషయాలను నేర్చుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News