బాలయ్య డైరక్టర్‌.. పవన్‌ కోసం..

Update: 2016-03-05 09:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు ప్రకటించగానే.. అదో హాట్ న్యూస్ అయిపోయింది. పవన్ తో మూవీకి మొదట తానే దర్శకత్వం వహించాలని దాసరి అనుకున్నా.. తర్వాత మాత్రం తను కేవలం నిర్మాణానికే పరిమితమై, వేరే దర్శకుడితో తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన చేసి ఇప్పటికి ఏడాది పూర్తి కావస్తున్నా.. ఇప్పటివరకూ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. స్టోరీ, డైరెక్టర్ ఫైనల్ కాకపోవడమే ఇందుకు కారణం.

గోపాలా గోపాలా ఫేం డాలీ దరకత్వంలో, సాయి మాధవ్ బుర్రా మాటలు రాసేలా ఓ కాంబినేషన్ సెట్ అయిందని అన్నారు కానీ.. అది కూడా ఫైనల్ కాలేదు. తర్వాత కూడా రెండు మూడు పేర్లు వినిపించినా, ఇప్పుడిందుకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. నందమూరి బాలకృష్ణతో లయన్ చిత్రాన్ని తెరకెక్కించిన సత్యదేవ.. ఓ సూపర్ కాన్సెప్ట్ ని దాసరికి వినిపించగా, ఆయనకి బాగా నచ్చిందని, త్వరలో పవన్ దగ్గరకు ఈ స్టోరీని తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే స్టోరీ విషయంలో దాసరికి పవన్ ఫుల్ రైట్స్ ఇచ్చినట్లు వార్తలున్నాయి. అంటే, ఈ ప్రాజెక్టు దాదాపు కన్ఫాం అయినట్లుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్న పవర్ స్టార్... త్వరలోనే దాసరితో సినిమాకి సంబంధించిన డీటైల్స్ ప్రకటించే ఛాన్స్ ఉందట.
Tags:    

Similar News