• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సత్యదేవ్ కి కాలం...

సత్యదేవ్ కి కాలం కలిసొచ్చినట్టే!

By - Tupaki Desk
Update: 2022-02-01 11:30 GMT
టాలీవుడ్ కి 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాతో సత్యదేవ్ పరిచయమయ్యాడు. చిన్నచిన్న పాత్రలతో కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, ఇప్పుడిప్పుడే హీరోగా కుదురుకుంటున్నాడు. సత్యదేవ్ ఇటీవల చేసిన 'తిమ్మరుసు' .. 'స్కైలాబ్' సినిమాలు రెండూ కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను రాబట్టలేకపోయాయి. సత్యదేవ్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆయన నటనకి వంకబెట్టలేం. పాత్ర ఏదైనా దానికి పూర్తిన్యాయం చేస్తుంటాడు. అందువల్లనే అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి.

చిరంజీవి తన 'గాడ్ ఫాదర్' సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకి సత్యదేవ్ పేరును సిఫార్స్ చేయడం, ఆయన టాలెంట్ కి నిదర్శనం. అలాంటి సత్యదేవ్ తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా చేస్తున్నాడు. అక్కడ ఆయన చేసిన 'రామ్ సేతు' సినిమా షూటింగు నిన్ననే పూర్తయింది. 'రామ్ సేతు' అనే పేరు వినగానే ఇది రామాయణంతో ముడిపడిన కథ అనే విషయం అర్థమైపోయి ఉంటుంది .. నిజంగానే కాన్సెప్ట్ అదే. గ్రాఫిక్స్ కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. అక్షయ్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో ఆయన సరసన జాక్విలిన్ కనిపించనుంది.

ఈ సినిమా షూటింగు పూర్తయినట్టుగా అక్షయ్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. బడా నిర్మాణ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలకమైన రోల్ చేశాడు. అక్షయ్ కుమార్ మూవీలో ఈ రోల్ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందనీ, ఈ సినిమా షూటింగు పూర్తయిందని సత్యదేవ్ కూడా చెప్పాడు. ఈ పాత్ర తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అన్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ సమయంలోనే సత్యదేవ్ బాలీవుడ్ వారి దృష్టిలో పడ్డాడని చెప్పచ్చు. ఈ సినిమా హిట్ అయితే ఆయనకి అక్కడి నుంచి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే, ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలు వేరు .. ఇప్పుడు చేస్తున్న సినిమాలు వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'గాడ్ ఫాదర్' .. 'గాడ్సే' సినిమాలు ఆయన గ్రాఫ్ ను సక్సెస్ దిశగా పెరిగెత్తించడం ఖాయమని అంటున్నారు. చూడబోతే సత్యదేవ్ కి కాలం కలిసొచ్చినట్టే కనిపిస్తోంది.
Tags:    
  • satyadev 
  • themmarusu 
  • skylab 
  • godfather 
  • megastarcheeranjivi 
  • movienews 
  • tupakiupdates 

Similar News

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

Copyright @2026

Powered by Blink CMS