#మెగా ఛాన్స్.. `లూసిఫర్` రీమేక్ లో యువహీరో జాక్ పాట్
ఒక్కో మెట్టు ఎక్కుతూ నెమ్మదిగా `ఉచ్చు బిగించడం` అన్నది రంగుల ప్రపంచంలో చాలా అవసరం. పదిమంది దృష్టిని ఆకర్షించి అందరితో మంచి అనిపించుకుని వందమందిలో నెగెటివిటీ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తపడి ఎన్నో చేస్తేనే ఇక్కడ తర్వాతి మెట్టు ఎక్కడం సాధ్యమవుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వడం గొప్ప అనుకుంటే హీరోగా ఎదిగేస్తుండడం ఇంకా గొప్ప. మాస్ మహారాజా రవితేజ.. నేచురల్ స్టార్ నాని.. రౌడీ దేవరకొండలా అందిరికీ సాధ్యం కాదు. ఎందరో వచ్చి వెళ్లారు. కొందరే నిలదొక్కుకున్నారు.
ఇప్పుడు ఆ రెండో కోవలోకే వస్తున్నాడు సత్యదేవ్. లాక్ డౌన్ చాలామందికి కలిసి రాకపోయినా ఈ యంగ్ హీరోకి అన్నిరకాలా కలిసొచ్చింది. 2020 లో మెజారిటీ ఓటీటీ ప్రియుల హృదయాలలోకి ప్రవేశించిన నటుడిగా పేరుతెచ్చుకున్నాడు సత్యదేవ్. ఏడాది ఆద్యంతం OTT లో పలు విడుదలలు చేసిన యంగ్ హీరోగా అందరికీ చేరువయ్యాడు. ఓవర్ నైట్ స్టార్ కాదు కానీ నెమ్మదిగా స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్నాడు.
అయితే అతడి వెయిటింగ్ పూర్తి స్థాయిలో ఫలించే రోజొచ్చింది. సడెన్ గా మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపునందుకుని మెగా రీమేక్ లో ఆఫర్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న లూసిఫెర్ రీమేక్ లో పృథ్వీరాజ్ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సత్యదేవ్ పేరును సూచించారు. సత్యతో చిరు సమావేశం లీకులు తాజాగా వైరల్ అవుతున్నాయి. సత్యకు బిగ్ బ్రేక్ ఖాయంగానే కనిపిస్తోందన్నది తాజా నివేదన. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి చిరును సత్య కలుసుకున్నట్లు రుజువులు బయటపడుతున్నాయి.