సరైనోడు పంచ్ సరిగ్గా తగిలిందా?

Update: 2016-07-29 22:30 GMT
సరైనోడు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇండస్ట్రీ రికార్డ్స్ లో నాలుగో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ సాధించడం చాలామందికి మింగుడు పడ్డం లేదు. ముఖ్యంగా ఈ మూవీకి రేటింగ్స్ రివ్యూలు రాసిన క్రిటిక్స్ కి సరైనోడు పెద్ద పంచ్ వేశాడని అనాల్సిందే.

అసలు సినిమాలో కంటెంట్ ఏమీ లేదని.. ఏ  మాత్రం ఆకట్టుకునే మూవీ కాదని.. రొటీన్ మాస్ మసాలా కంటెంట్ అని.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కాదని రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. అయితే ఆశ్చర్యకరంగా సినిమాకి అన్ని వర్గాల నుంచి సపోర్ట్ వచ్చింది. ఫ్యామిలీస్ కి విపరీతంగా నచ్చేసింది. 76 కోట్ల కలెక్షన్స్ సాధించడమే కాదు.. ఏపీ - వైజాగ్ - వెస్ట్ గోదావరి - కేరళల్లో నాన్ బాహుబలి రికార్డులన్నీ తన పేరుపైనే రాసేసుకున్నాడు సరైనోడు.

అసలు సినిమాలో యాక్షన్ కంటెంట్ ఉంటుందని ముందునుంచే చెప్పినా., మూవీలో యాక్షన్ ఎక్కువైందనే రివ్యూ రైటర్లు రాశారు. అయితే.. చెప్పిన కంటెంట్ ని చెప్పినట్లుగా ప్రెజెంట్ చేసిన తీరుకు.. ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పట్టేసి బ్లాక్ బస్టర్ చేసేశారు.
Tags:    

Similar News