స‌ర్కారు వారు రారు మొద‌లెట్ట‌రు ఇక ఇంతేనా?

Update: 2022-05-01 05:30 GMT
విడుద‌ల‌కు రెండు వారాలే మిగిలి ఉన్నా సూప‌ర్ స్టార్ బ‌య‌ట‌కు రాడేమిటీ? అంటూ ఒక‌టే గుస‌గుస‌. అయితే స‌ర్కార్ వార ఇండియాలో అందుబాటులో లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ప్ర‌స్తుతం మ‌హేష్ ఫ్యామిలీ వెకేష‌న్ లో ఉన్నారు. అది కూడా ప్యారిస్ న‌గ‌రానికి వెళ్లారు. త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన డెస్టినేష‌న్స్ ని విజిట్ చేసి న‌మ్ర‌త‌-గౌత‌మ్ - సితార‌ల‌కు మ‌ర‌పురాని అనుభూతిని అందిస్తున్నారు.

అయితే కొద్ది రోజుల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌ర్కార్ వారి పాట ప్ర‌మోష‌న్ ని మ‌హేష్ మ‌రిచారా? అంటూ సెటైర్లు ప‌డిపోతున్నాయ్. అయితే ఇవేవీ ప‌ట్టించుకోకుండా చిత్ర‌బృందం వీలున్నంత‌వ‌ర‌కూ అందుబాటులో ఉన్న టెక్నీషియ‌న్ల‌తో ప్ర‌మోష‌న్ ని కానిచ్చేస్తోంది. ఇన్నాల్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌న్ బోలెడంత ప్ర‌చారం చేసాడు.

ఈ చిత్రం నుంచి భారీ ట్రైలర్ ను మే 2వ తేదీన విడుదల చేయనున్నామని ఈలోగా టెక్నికల్ టీమ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయ‌డానికి ఉప‌క్ర‌మించింది. మొదట ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్- ఆ తర్వాత ఎడిటర్ మార్తాండ్.కె.వెంకటేష్ ఇప్పుడు థమన్ ఇంటర్వ్యూల‌తో కొంత ప్ర‌చారం ప‌రంగా ట‌చ్ ఇచ్చారు. ఈ చిత్రం విడుదలకు ఇంకా 2 వారాలు మాత్రమే ఉన్నందున నాయ‌కానాయిక‌ల ప్ర‌చారం పెండింగులో ఉంది. ఇక‌పై కీర్తి సురేష్ ని బ‌రిలో దించుతార‌ట‌.

ఆ త‌ర్వాత మ‌హేష్ బ‌రిలోకొస్తార‌ని తెలిసింది. సినిమాల ట్రైలర్ విడుదలైన తర్వాత చిత్రం చుట్టూ ఉన్న హైప్ రెట్టింపు అవుతుందని తద్వారా భారీ ప్రచారం సులువుగా ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కం టీమ్ పెట్టుకుంద‌ట‌. స‌ర్కార్ వారి పాట కేవ‌లం తెలుగు వెర్ష‌న్ మాత్ర‌మే విడుద‌ల‌వుతుంది.

తొలి నుంచి తెలుగు ఆడియెన్ నే ల‌క్ష్యంగా భావించి ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీ అని ప్ర‌క‌టించ‌లేదు. ప‌ర‌శురామ్ ఇంత‌కుముందు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక ఇది మ‌హేష్ కెరీర్ లో నే మాస్ యాక్ష‌న్ చిత్రాల్లో డిఫ‌రెంటుగా నిలుస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. మే 12న  చిత్రం విడుద‌ల కానుంది.
Tags:    

Similar News