ఒక్కోసారి కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు ఎవరు ఊహించని విధంగా విజయాల్ని సాధించి పెడతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో మంచి కథ కన్నా డిఫరెంట్ కథ ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అలాంటి కథల్లో ఒక్క పాత్ర అయినా ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతే మళ్లీ మళ్లీ వెళ్లి చూడటం ఖాయం.
అదే తరహాలో ఒక కన్నడ సినిమాలో ఓ ముద్దుగుమ్మ కోసం అక్కడి ప్రేక్షకులు పదే పడే వెళ్లి సినిమా చూశారట. నాలుగు కోట్లతో క్యాంపస్ రొమాంటిక్ కామెడీ తరహాలో తెరకెక్కిన "కిరిక్ పార్టీ" అనే సినిమా 50 కోట్లని కొల్లగొట్టింది. ఆ సినిమాలో ఆరుగురి అబ్బాయిల మధ్య ఓ లేడి క్యారెక్టర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో హీరో నిఖిల్ సిద్దార్థ్ రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆ లేడి క్యారెక్టర్ చేసిన సంయుక్త హెగ్డే ని తెలుగులో కూడా అదే పాత్రకు ఫిక్స్ చేశారట. ఇంజనీరింగ్ అమ్మాయిగా ఆర్య అనే పాత్రలో మెప్పించిన సంయుక్త ఈ సినిమాలో అదే లుక్ లో కనిపించడానికి రెడీ అయిపోయింది. నిఖిల్ కి కూడా ఆమె పాత్రకు ఆమెనే తప్ప ఇంకెవరు మైండ్ లోకి రాలేదట. నిజానికి ఈ సినిమాలో తొలి అర్ధంలో రష్మిక మందనా హీరోయిన్ అయితే.. సెకండాఫ్ లో ఈ సంయుక్త హీరోయిన్. అలా ఉంటుందీ కథ. అందుకే ఇక్కడ కూడా రెండో భాగానికి ఆ అమ్మడినే తీసుకోవాలని ఫిక్సయినట్లున్నారు.
తెలుగు ప్రేక్షకుల అభిరుచికిి తగ్గట్టుగా ఈ హీరోయిన్ల పాత్రలను కొంచెం మలచనున్నారట. అందుకోసం సుధీర్ వర్మ - చందు మొండేటి స్క్రిప్ట్ విషయంలో నిఖిల్ కు హెల్ప్ చేస్తున్నారట. ఇక ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సంయుక్త మొదట ఇండస్ట్రీలో కి డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చింది. అనేక షోలల్లో ఆమె మంచి ప్రతిభను కనబరిచింది. అయితే అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో డాన్స్ ని కాస్త పక్కన పెట్టేసింది. ఒక వేళ తెలుగు కిరిక్ పార్టీ లో ఆ ఛాన్స్ వస్తే గనక కుమ్మేస్తాను అంటోంది.