ఈ పిల్ల భలే ఆకర్షిస్తోందే!!

Update: 2018-03-17 07:34 GMT
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నటనలో ఎనర్జీ కనిపిస్తే హీరో హీరోయిన్స్ కు ఆఫర్స్ చాలానే వస్తాయి. సినిమాకు ఎదో ఒక విధంగా ప్లస్ అవుతారు అనిపించాలే గాని ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఓ ముద్దుగుమ్మ కూడా తన ఎనర్జీతో అందరిని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు. శుక్రవారం రిలీజ్ అయిన కిర్రాక్ పార్టీ సినిమాలో కనిపించిన సంయుక్త హెగ్డే.

ఈ మంగళూరు బ్యూటీ 17 ఏళ్లకే కన్నడ సినిమా కిరిక్ పార్టీ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అదే సినిమాను ఇప్పుడు తెలుగులో నిఖిల్ రీమేక్ చేశాడు. అయితే రీమేక్ లో ఆమె పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేస్తారా అని అంతా అనుకున్నారు. చిత్ర యూనిట్ కి ఆమె కంటే మంచి నటి దొరకకపోవడంతో ఆమెనే తెలుగు పాత్రకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం మరికొంత మంది దర్శకులు కూడా ఆ బ్యూటీ డేట్స్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.

ఆమె ఎనర్జీ చూసి నిర్మాతలు కూడా దర్శకుడి కోణంలో అలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారటల. సంయుక్త సినిమాలోనే కాదు బయట కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తుంది. కిర్రాక్ పార్టీకి సంబందించిన వేడుకల్లో గాని ప్రెస్ మీట్స్ లో గాని ఈ క్యూట్ అమ్మాయి చాలా అల్లరిగా కనిపించింది. సంయుక్త డ్యాన్సులో కూడా బెస్ట్ అని నిరూపించుకుంది. ఆమెకు 10 రకాల డ్యాన్సులతో పాటు 5 భారతీయ భాషలు వచ్చట. అలాగే దర్శకుల ఆలోచనలకు తగ్గట్టుగా వర్క్ చేసే ఈ బ్యూటీతో వర్క్ చేయాలనీ చాలా మంది అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
మరిన్ని ఫొటోస్ కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News