ఆ డైరెక్టర్ తో సమంత హ్యాట్రిక్ కొట్టనుందా..?

Update: 2020-04-13 14:30 GMT
బ్యూటీ అక్కినేని సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సమంత. ఇక తన మొదటి హీరో నాగచైతన్యనే వివాహం చేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత నటించిన తాజా సినిమా జాను. తమిళ సినిమా 96కు తెలుగు రీమేక్ ఇది. మంచి అంచనాల మధ్య విడుదలై పెద్దగా అలరించలేకపోయింది. అయినా.. 'జాను'లో సమంత నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ సినిమా తర్వాత సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది వీరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది.

త్వరలో సమంత - నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. చైతూ.. ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ సమంత, చైతూ కలిసి నటించిన చాలావరకు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో సమంతకి జోడీగా చైతన్య అయితే బాగుంటుందని అని నందిని రెడ్డి భావించడంతో అతనిని హీరోగా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. సమంత-నందినిరెడ్డి కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇదివరకు జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు రూపొందాయి. ఇక తాజా మూవీ ఒక కొరియన్ మూవీ రీమేక్ గానే తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎమోషనల్ డ్రామాగా ఉండబోయే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని సమాచారం. త్వరలో ఈ మూవీ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News