#ఆహా-ఓటీటీ.. షాకిస్తున్న స‌మంత పారితోషికం

Update: 2020-12-16 04:51 GMT
స్టార్ హీరోయిన్ స‌మంత లాక్ ‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. `జాను` ఆశించిన‌ ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో కొంత నిరాశ‌కు గురైన సామ్ కొన్ని రోజులు సినిమాల‌కు బ్రేకిచ్చింది. ఇంటి రూఫ్ టాప్ పై వ్య‌వ‌సాయం.. సాకీ డ్రెస్ బ్రాండ్ ప్ర‌చారం.. స్కూల్ బిజినెస్.. అంటూ కొత్త కొత్త వ్యాప‌కాల‌పైకి త‌న‌ దృష్టిని మ‌ర‌లించింది. నిత్యం సోష‌ల్ మీడియాలో వుంటూ త‌న‌కి సంబంధించిన విష‌యాల్ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ సంద‌డి చేసారు సామ్.

లాక్ డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్ ల‌కు బ్రేక్ ప‌డ‌టంతో కొంత రిలాక్స్ అయిన సామ్ `ఆహా` ఓటీటీకి కోసం అనూహ్యంగా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించాడానికి ముందుకొచ్చింది. `సామ్ జామ్‌` పేరుతో ప్రారంభించిన ఈ టాక్ షో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గెస్ట్ గా మొద‌లైంది. ఆ త‌రువాత రానా- నాగ్ అశ్విన్ - సైనా నెహ్వాల్ ఈ టాక్ షోలో సంద‌డి చేశారు. ఇటీవ‌ల త‌మ‌న్నా తాజాగా ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ షోలో పాల్గొని త‌మ అనుభ‌వాల్ని పంచుకున్నారు.

అయితే ఈ టాక్ షో కోసం సామ్ ఏమేర‌కు పారితోషికం అందుకుంటున్నారు? అంటే క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజం తెలిసింది. ఓటీటీ కోసం భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసింద‌ని తెలుస్తోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ ల‌కు గానూ స‌మంత‌కు కోటి రూపాయ‌లు పారితోషికం ఇచ్చారట‌. ప్ర‌స్తుతం ఇది టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ ‌గా మారింది. కేవ‌లం ఎనిమిది ఎపిసోడ్ ల‌కు కోటి అంటే భారీ మొత్త‌మే అని స్టార్ హీరోయిన్స్ షాక‌వుతున్నార‌ట‌. సాటి యాంక‌ర్ల‌కు ఇది మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మే అయ్యింద‌ట‌.
Tags:    

Similar News