ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం సారీ చెప్పిన సమంత అక్కినేని
అక్కినేని కోడలు సమంత సారీ చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో తన పాత్ర వల్ల ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసినా వారందరికీ నా తరపున క్షమాపణలు కోరుతున్నాను అని సామ్ అన్నారు. రాజ్ & డికె సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో సామ్ హిందీ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రదర్శనను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడు ఐటి మంత్రి టి మనో తంగరాజ్ ఒక లేఖ రాశారు. ``ఈ సిరీస్ ఈలం తమిళుల మనోభావాలను మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసింది`` అని ఆరోపించారు. తమిళ ఈలం గురించి ప్రతికూలంగా సన్నివేశాల్ని చిత్రీకరించడంతో సామ్ రాజీ పాత్ర పై తమిళ ప్రజలు విరుచుకుపడ్డారు.
వివాదాస్పద అంశాన్ని స్వయంగా ప్రస్తావించకుండా విమర్శలకు సమాధానమిస్తూ... సమంత అక్కినేని ఇన్నాళ్టికి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది. ప్రజలు తమ సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకవేళ వారు ఆ అభిప్రాయంతో ఉండాలని నిర్ణయించుకుంటే ఎవరి మనోభావాలను దెబ్బతీసినా దానికి నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు. హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కనుక నేను మీకు నచ్చనివి చేసినట్లయితే నన్ను క్షమించండి... అని సామ్ అన్నారు. ఇప్పటికీ ఆగ్రహం కలిగి ఉన్న వ్యక్తులనుహృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. అని అననారు. మనోజ్ బాజ్ పేయి - ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ లో సమంత అక్కినేని రాజి అనే తీవ్రవాది పాత్రలో నటించింది.
సమంత చెప్పులు కొట్టేసిన దొంగ ఎవరు?
సోషల్ మీడియాల్లో అక్కినేని కోడలికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసినదే. తాజాగా సమంత సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఓ ఫోటో దాని క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. సామ్ తాజాగా ఒక సిండ్రెల్లా స్టోరీని చెప్పారు. ``నా చెప్పుల్లో ఒకదాన్ని పోగొట్టుకున్నాను! అది ఎవరు దొంగిలించారో`` అంటూ తన ఫోటోని పోస్ట్ చేసింది. ఒక డాగ్ ఎమోజి... ని సామ్ జోడించారు. దీనిని బట్టి సమంత ఎంతో ప్రేమగా పెంచుకునే హాష్ అనే కుక్కపిల్ల ఆ చెప్పును కొట్టేసిందని గ్రహించవచ్చు. ప్రతిరోజూ ఇలాంటి అరుదైన క్షణాలను సామ్ ఎంతో ఆస్వాధిస్తున్నారని అర్థమవుతోంది. హాష్ కి సామ్ ఉత్తమ మదర్ అనడంలో ఎలాంటి సందేహాల్లేవ్. హాష్ ఎప్పుడూ సామ్ నే అంటిపెట్టుకుని ఆటపాటలతో అల్లరిగా ఉంటుంది. తనని ఎప్పుడూ అంతే ప్రేమగా చూసుకుంటుంది సమంత.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... సమంత అక్కినేని తదుపరి పౌరాణిక చిత్రం శాకుంతలంలో కనిపించనుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. ఈ చిత్రం మహాకవి కాళిదాసు రాసిన `అభిజ్ఞాన శాకుంతలం` అనే ప్రాచీన నాటకం ఆధారంగా రూపొందించినది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా క్రైసిస్ కష్ట కాలంలో ప్రారంభమైనా అత్యంత వేగంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. ఇటీవలే గుమ్మడి కాయ కార్యక్రమంలో సమంత..అర్హ-గుణశేఖర్ టీమ్ సందడి చేశారు. అలాగే నయనతార- విఘ్నేష్- సేతుపతి ల తమిళ చిత్రంలోనూ సమంత ఒక కథానాయికగా నటిస్తోంది. భర్త చైతన్యతో కలిసి మజిలీ తరహాలో మరో సినిమాలో నటించేందుకు సమంత సన్నాహకాల్లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సస్ తర్వాత నెట్ ఫ్లిక్స్ తో భారీ వెబ్ సిరీస్ కోసం డీల్ కి సంతకం చేశారన్న ప్రచారం ఉంది.