మూవీ రివ్యూ: సామజవరగమన

Update: 2023-06-29 09:59 GMT
మూవీ రివ్యూ: సామజవరగమన

నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

సంగీతం : గోపీ సుందర్

స్టోరీ : భాను భోగవరపు

దర్శకుడు :  రామ్ అబ్బరాజు

నిర్మాతలు: రాజేష్ దండా        

టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. ఫలితాలతో సంబంధం లేకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు శ్రీ విష్ణు. ఈ క్రమంలో హిట్లు వచ్చాయి.. ఫ్లాపులు
పలకరించాయి.. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా సతమతమవుతున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ తో సినిమా పక్కా ఎంటర్టైనర్ అన్న బజ్ క్రియేట్ చేయగా ప్రమోషన్స్ కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాయి. శ్రీ విష్ణు సామజవరగమన ఎలా ఉంది. సినిమా ట్రైలర్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉందా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.  

కథ :

బాల సుబ్రహ్మణ్యం అలియాస్ బాలు (శ్రీ విష్ణు) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. హైదరాబాద్ మల్టీప్లెక్స్ చైన్ లో పనిచేస్తుంటాడు బాలు. అతని ఫాదర్ ఉమా మహేశ్వర రావు (నరేష్) 3 దశాబ్దాలుగా
ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ వస్తాడు. అతను డిగ్రీ పాస్ అయితే కానీ అతని ఫ్యామిలీ ప్రాపర్టీ తనకు రాదు. అందుకే బాలు కూడా తండ్రి డిగ్రీ పాస్ అవడం కోసం సహాయం చేస్తాడు. ఇదే టైం లో సరయు (రెబా మోనికా జాన్) బాలు ఇంట్లోకి పేయింగ్ గెస్ట్ గా వస్తుంది. బాలుని ఆమె లవ్ లో పడేయడంలో సక్సెస్ అవుతుంది. అయితే సరయు తండ్రి బాలు ఫ్యామిలీని కొన్ని కారణాల వల్ల ద్వేషిస్తాడు. బాలు సరయు ఫాదర్ ని ఎలాగైనా మెప్పించే క్రమంలో మరికొన్ని స్ట్రగుల్స్ లో పడతాడు. బాలు తండ్రి డిగ్రీ పాస్ అవుతాడా..? సరయు ఫాదర్ బాలుని యాక్సెప్ట్ చేస్తాడా..? బాలు తన సమస్యలన్ని సాల్వ్ చేసుకున్నాడా అనేది సినిమా కథ.

కథనం - విశ్లేషణ :  

ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు కానీ ప్రేక్షకులను నవ్వించగలిగే సినిమా తీయడం మాత్రం చాలా కష్టం. చూసి నవ్వుకోడానికి బాగుండేలా సినిమా తీయడం అనేది నవ్వినంత ఈజీ అయితే కాదు. అంతేకాదు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా ఎప్పుడు ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. అయితే కొందరు కామెడీ కోసం అనవసరమైన ట్రాక్ లు.. వల్గర్ డైలాగ్స్ పెడుతుంటారు కానీ అవేవి లేకుండా నవ్వించాలని చేసిన సామజవరగమన సినిమా ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.

టికెట్ పెట్టి కొన్న ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న దర్శకుడు సినిమాను ఆహ్లాదకరమైన వినోదంతో హాయిగా నవ్వుకునేలా చేశారు. ఈ విషయంలో దర్శకుడిని తప్పకుండా మెచ్చుకుని తీరాలి. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర కూడా దర్శకుడు తన లైన్ క్రాస్ చేయలేదు అది నిజంగా ప్రశంసించాల్సిన విషయమే. ఇక శ్రీ విష్ణు అయితే ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించారు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో పంచులతో శ్రీ విష్ణు సినిమాకు మేజర్ హైలెట్ అయ్యారు.

అందరిలా కాకుండా కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న శ్రీ విష్ణు ఈమధ్య వరుస ఫ్లాపులు ఫేస్ చేశారు. కానీ సామజవరగమన ఫైనల్ గా ఆయన్ను హిట్ ట్రాక్ ఎక్కించేసింది. అప్పట్లో ఒకడుండేవాడు, భళా తందనాన, అల్లూరి, నీది నాది ఒకే కథ సినిమాలతో యువతను ఆకట్టుకున్న శ్రీ విష్ణు చాలా నిజాయితీగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సక్సెస్ ల తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోగా ఫైనల్ గా శ్రీ విష్ణు సామజవరగమన తో ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు.

సామజవరగమన సినిమా ఎలాంటి రిస్క్ లేకుండా రైటర్స్ బాగా హ్యాండిల్ చేశారు. సినిమా మొత్తం ఒక మంచి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. సినిమా మొదటి నుంచి
ఇంటర్వెల్ వరకు హిలేరియస్ కామెడీ తో నవ్వించారు. హీరో, హీరో ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక హీరోయిన్ సీన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి.
ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డారు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

సినిమాలో లవ్ సీన్స్ అంత గొప్పగా లేకున్నా పర్వాలేదు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో మెప్పించగా సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైనింగ్ గానే సాగించారు. కొన్ని ఫన్ ఎపిసోడ్స్ బాగున్నా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఫన్ మీద ఫోకస్ పెట్టి ఎమోషన్స్ విషయంలో కాస్త లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎమోషనల్ గా హై పాయింట్ ఎక్కడ అనిపించలేదు. రాజీవ్ కనకాల స్టోరీ ఎందుకో అంతగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే సామజవరగమన ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. సినిమా వెళ్లి కూర్చుంటే హాయిగా రెండు గంటలు నవ్వుకునేలా మంచి రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది.  

నటీనటులు :

తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రీ విష్ణు సామజవరగమన సినిమాలో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెపించారు. కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్. ఈ సినిమా అంతా శ్రీ విష్ణు తన భుజాన మోశారని చెప్పొచ్చు. ముఖ్యంగా నరేష్ తో కలిసి వచ్చే సీన్స్ అయితే థియేటర్ లో ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ తోనే సినిమా హిట్ అనేంతగా వర్క్ అవుట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ లో కూడా శ్రీ విష్ణు ది బెస్ట్ అనిపించారు. అయితే డ్యాన్స్ ల విషయంలో మాత్రం ఇంకాస్త ట్యూన్ అవ్వాల్సిందే.  

హీరోయిన్ రెబా మోనికా జాన్ స్క్రీన్ మీద చాలా అందంగా అనిపిస్తుంది. తను కూడా ఈ సినిమాలో కామెడీ సీన్స్ బాగా చేసింది. ఈ సినిమాలో నరేష్ అయితే అదరగొట్టేశారని చెప్పాలి. డిగ్రీ పూర్తి చేయలేని తండ్రి పాత్రలో నరేష్ నటన సూపర్ అంతే. అతని పాత్ర గెటప్ అంతా కూడా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. వెన్నెల కిశోర్ కూడా సినిమా సెకండ్ హాఫ్ లో పడిపోకుండా నిలబెట్టారు. వెన్నెల కిశోర్ లోని కామెడీ సెన్స్ ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. సుదర్శన్ కూడా సినిమాలో మంచి పంచ్ డైలాగ్స్ వేసి అలరించారు. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా బాగానే చేశారు. సినిమాలో మిగతా పాత్రదారులంతా కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  

సాంకేతిక వర్గం :

సామజవరగమన సినిమాటోగ్రఫీ బాగుంది. రామ్ రెడ్డి విజువల్స్ చాలా ఇంప్రెస్ చేశాయి. సినిమాకు చాలా మంచి రిచ్ లుక్ ఇచ్చారు. గోపీ సుందర్ మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. గుర్తు పెట్టుకునేంత పాటలు లేవు కానీ కొన్ని సీన్స్ లో తన బిజిఎం బాగా హైలెట్ అయ్యింది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. సినిమా చాలా క్రిస్పీ గా.. షార్ట్ రన్ టైం లో ఎడిటింగ్ చేయడం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత కావాలో అంత పెట్టారు. ఇక డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఆడియన్స్ కి ఇలాంటి ఎంటర్టైన్ మెంట్ సినిమా అందించడం తో రామ్ అబ్బరాజు తన ప్రతిభ చూపించారు. స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్ గా ఉంది. మంచి కథ అందుకు తగినట్టుగా కథనం నటీనటుల పర్ఫార్మెన్స్ ఇలా అన్ని సామజవరగమన సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ విషయంలో కాస్త అసంతృప్తి తప్ప సినిమా ఎక్కడ వేలెత్తి చూపించడానికి లేదు.

చివరగా : సామజవరగమన.. ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్..!

రేటింగ్ : 3/5  


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Similar News