సల్మాన్ మూవీని 230 కోట్లకు కొనేశారట!
కరోనా నేపథ్యంలో బాగా దెబ్బతిన్న రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి. దాదాపు ఏడెనిమిది నెలలు షూటింగులు నిలిచిపోవడమే కాకుండా.. థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకులు మునుపటి మాదిరిగా ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే’కు భారీ రేట్ ఇచ్చి కొనుగోలు చేసింది ఓ సంస్థ.
వాస్తవానికి.. కొవిడ్-19 తీవ్రత తగ్గక ముందే.. కరోనా స్ట్రెయిన్ అంటూ కొత్తరకం దూసుకొస్తోంది. ఇప్పటికే బిజినెస్ దెబ్బతినడంతో ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలను విడుదల చేసేందుకు ముందూ వెనకా ఆలోచిస్తున్నారు నిర్మాతలు. పరిస్థితులన్నీ చక్కబడి పూర్తిస్థాయిలో బిజినెస్ జరిగేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లోనూ సల్మాన్ ఖాన్ ‘రాధే’కు పలికిన రేటు బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో సంచలనం రేపుతోంది. సల్మాన్ సొంత నిర్మాణ సంస్థలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోల్ సేల్‌గా అన్ని హక్కులూ కలిపి రూ.230 కోట్లకు జీ స్టూడియోస్ కొనేసినట్లు సమాచారం.
అయితే.. తొలుత ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్నది ప్రణాళిక. కమీషన్ బేసిస్ మీద ఆ చిత్రాన్ని యశ్ రాజ్ వాళ్లు రిలీజ్ చేసేలా ఒప్పందం కుదిరింది. కానీ.. ప్రస్తుతం దూకుడు మీదున్న జీ స్టూడియోస్.. కొత్త సినిమాల థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కుల్ని ఒకేసారి కొనేస్తోంది. ఈ కోవలోనే సల్మాన్ మూవీని కూడా భారీ రేటుకు కొనుగోలు చేసింది.
తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని అలాగే సొంతం చేసుకుంది జీ సంస్థ. ఈ సినిమా విషయంలో వాళ్ల ప్లాన్ వర్కవుట్ అయ్యింది. వాళ్ల అంచనాలను మించి ఈ చిత్రం వసూళ్లు సాధించింది. దీంతో.. సల్మాన్ సినిమా కూడా వసూళ్లు సాధిస్తుందని, సల్మాన్ క్రేజ్ తో ఆ మొత్తం తిరిగి వచ్చేస్తుందని ఆ సంస్థ భావించి, భారీ రేటు పెట్టి కొనేసిందట. కొత్త ఏడాదిలో థియేటర్లు 100 శాతం నడవడం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ముందుగా థియేటర్లలో రిలీజ్ చేసి, ఆ తర్వాత జీ5లో సినిమాను స్ట్రీమ్ చేస్తారట. ఆ తర్వాత జీ టీవీ ఛానెల్లో సీడీ అరిగేంత వరకూ రిపీట్ చేస్తారన్నమాట. ఏదిఏమైనా.. ఈ పరిస్థితుల్లో ఇంత రేటు పెట్టి సినిమాను కొనుగోలు చేయడం గొప్ప విషయమే అంటున్నారు విశ్లేషకులు.