సల్మాన్ చేస్తున్నాడు.. మరి పవన్‌?

Update: 2016-07-26 13:30 GMT
''సుల్తాన్‌'' సినిమా సక్సెస్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌.. తదుపరి కబీర్ ఖాన్‌ డైరక్షన్లో ''ట్యూబ్ లైట్'' అనే సినిమాను చేస్తున్నాడు. మరి ఈ సినిమాకూ పవన్‌ కళ్యాణ్‌ త్వరలో డాలీ డైరక్షన్ లో చేయబోయే సినిమాకు కనక్షన్ ఏదైనా ఉందా? అబ్బే లేదు. కాని సల్మాన్ వింటున్న ఓ కథకూ.. పవన్ చేయబోయే సినిమాకూ ఒక ఎమోషనల్ కనక్ట్ ఉంది.

సల్మాన్ తీసిన ''దబాంగ్‌'' సినిమా దాదాపు తెలుగు సినిమాలాగే ఉంటుంది. అందుకే వెంటనే పవన్ దానిని ''గబ్బర్ సింగ్‌'' అంటూ తెరకెక్కించాడు. ఒకసారి కిక్కిచ్చింది కదా అని రెండోసారి దబాంగ్ 2 అంటే.. ఆడియన్స్ కిక్ రాలేదని చెప్పేశారు. పవన్ పరిస్థితి కూడా అంతే. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ సందడి చేస్తే.. అబ్బే అస్సలు ఎక్కట్లేదు బాసూ అన్నారు. కట్‌ చేస్తే సర్దార్ ఎండ్ టైటిల్స్ వేసినప్పుడే.. సీక్వెల్ తో వస్తానని పవర్ స్టార్ హింటిచ్చాడు. ఇప్పుడు సల్మాన్ దగ్గరకు వస్తే.. మనోడు కూడా దబాంగ్ 3 తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. దాదాపు కథ రెడీ అయిపోయింది. సినిమాను ఎప్పుడు షూట్ చేయాలి.. హీరోయన్ ఎవరూ.. డైరక్టర్.. బడ్జెట్.. వగైరా విషయాలను ఫైనల్ చేస్తున్నాడట.

మరి పవన్ కూడా మరో గబ్బర్ సింగ్ సీక్వెల్ కోసం రంగం ఎప్పుడు సిద్దం చేస్తాడో ఏంటో. లేకపోతే సర్దార్ ఇచ్చిన స్ర్టోక్ చూశాక అసలు ఆ ఆలోచనే మానుకుంటాడా? వెయిట్ అండ్ సి.
Tags:    

Similar News