షారుఖ్ కోసం దుబాయ్ వెళ్లనున్న సల్మాన్..!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ 2021లో కొత్త ఉత్సాహంతో కొత్త సినిమాలతో బిగ్ స్క్రీన్ పై కలుద్దాం అని ఇటీవల వీడియో సందేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియో సందేశంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమి చెప్పలేదు. కానీ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు షారుఖ్. తాజాగా షారుఖ్ నటిస్తున్న సినిమా పఠాన్. ఈ సినిమాను మొన్నటివరకు చెప్పినట్లుగానే దుబాయ్ లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం షారుఖ్ దుబాయ్ వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. దుబాయ్ లోని ఐకానిక్ బూర్జ్ ఖలీఫా దగ్గర కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. షారుఖ్, దీపిక పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసం సల్మాన్ ఖాన్ త్వరలో షూటింగ్ లో పాల్గొనేందుకు దుబాయ్ కి వెళ్ళబోతున్నాడట. షారుఖ్ గత కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అంతేగాక చివరి సినిమా జీరో నిర్మించి భారీగా నష్టపోయాడట. అందుకే ఈసారి సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ప్రస్తుతం పఠాన్ సినిమాలో జాన్ అబ్రహం కీలకపాత్రలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పఠాన్ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదేగాక షారుఖ్ తదుపరి సినిమా లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానితో చేయనున్నాడు. చూడాలి మరి షారుఖ్ పఠాన్ తో అయినా ఫామ్ లోకి వస్తాడేమో!