చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కులతో ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్

Update: 2022-10-19 02:30 GMT
చట్టపరమైన చిక్కులు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల‌కు ఆదిలోనే హంస‌పాదుగా మారుతుంటాయి. ముందే ఎలాంటి గ‌డ‌బిడ లేక‌పోయినా సినిమాని ప్రారంభించాక కొత్త స‌మ‌స్య‌ల‌ను ఎగ‌దోస్తారు.  దీనివ‌ల్ల అమాంతం బ‌డ్జెట్ పెరుగుతుంది. కోర్టు స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా ప‌రిష్కారం కావు. ఇలాంటి కార‌ణాల‌తో సల్మాన్ ఖాన్ త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన నోఎంట్రీ సీక్వెల్ ను వదులుకున్నార‌ని తెలిసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

సల్మాన్ ఖాన్ అభిమానులు `నో ఎంట్రీ 2` కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ సీక్వెల్ సూపర్ స్టార్  స‌ల్మాన్ కి అత్యంత‌ ఇష్టమైన ప్రాజెక్ట్ లలో ఒకటి. నో ఎంట్రీ 2 కోసం అనీస్ బాజ్మీ స్క్రిప్ట్ ను ఇప్ప‌టికే రెడీ చేసారు. వచ్చే ఏడాది అంటే 2023 ప్రారంభంలో చిత్రీకరణను ప్రారంభించాలని కూడా భావించారు. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ అత‌ని బృందం నో ఎంట్రీ 2ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తిగా ఉన్నారు. అనీస్ బాజ్మీ రాసిన స్క్రిప్ట్ అతనికి నచ్చింది. ఇది నవ్వుల అల్లరి కాన్సెప్టుతో రంజింప‌జేస్తుంది. నిజానికి గడిచిన‌ దశాబ్ద కాలంలో తాను చదివిన అద్భుత‌మైన కామెడీ స్క్రిప్ట్ లలో ఇది ఒకటి అని స‌ల్మాన్ భాయ్  భావించాడు. కానీ అనేక చట్టపరమైన అవాంతరాలు సమస్యలు సృష్టించాయి.

సహారా వన్ మోషన్ పిక్చర్స్ ఇప్పుడు పనికిరాని సంస్థగా మారడం వల్ల ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ పరిష్కరించడం చాలా సులభం అని భావించారని అయితే ఇది చాలా క్లిష్టంగా ఉందని సోర్స్ చెబుతోంది.

మరో సమస్య ఏమిటంటే ఖర్చులు విపరీతంగా పెరగడం.. పాత సినిమాతో సంబంధమున్న నిర్మాత‌లు ప్రతి ఒక్కరికీ డబ్బు చెల్లించి రైట్స్ ను సొంతం చేసుకోవాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే వారు మొత్తం ఖర్చులను లెక్కించినప్పుడు అది నిర్ణీత బడ్జెట్ కు మించిపోయింది. సల్మాన్ ఖాన్ కి సన్నిహితంగా ఉండే వ్యక్తులు.. అది సెట్స్ కి వెళ్ళిన తర్వాత వారంతా సమస్యలను లేవనెత్తవచ్చని భావించినట్లు తెలుస్తోంది.

చట్టపరమైన కోణంలో విష‌యాలేవీ పారదర్శకంగా లేనందున వారు అనుకోని రీతిలో మూడవ పక్షం (పార్ట్ 1 నిర్మాత‌లు) సమస్యలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఇది సినిమా ఖర్చు ను బడ్జెట్ ను అమాంతం పెంచుతుంది.

దానివ‌ల్ల చివరికి సల్మాన్ ఖాన్ `నో ఎంట్రీ 2`ని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. సూపర్ స్టార్ ఇప్పుడు జనవరి లేదా ఫిబ్రవరి 2023 నుండి కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు వేరే స్క్రిప్ట్ లను ప‌రిశీలిస్తున్నాడు. అనీస్ బాజ్మీ కూడా తన సూపర్ హీరో కామెడీని రెడీ చేస్తూ బిజీగా ఉన్నాడు.

నో ఎంట్రీ క‌థాంశం ఇదీ..!

వార్తాపత్రిక యజమాని కిషన్ (అనిల్ కపూర్) తన భార్య కాజల్ (లారా దత్తా)తో కాపురంలో ఎప్పుడూ నమ్మకంగా ఉంటాడు. కానీ త‌న భ‌ర్త ఎఫైర్ల‌తో త‌న‌ని మోసం చేస్తుంటాడ‌ని అనుమానిస్తుంటుంది. ఈలోగా కిషన్ వివాహిత స్నేహితుడు ప్రేమ్ (సల్మాన్ ఖాన్) తన చురుకైన భార్య పూజ (ఈషా డియోల్)ని ఏదో ఒక ర‌కంగా తరచుగా మోసం చేస్తుంటాడు. కిషన్ -ఫోటోగ్రాఫర్ సన్నీ (ఫర్దీన్ ఖాన్) అసమ్మతిని ఎదుర్కొంటాడు. అతని నైతికవాద స్నేహితుల మాటలు విని విసిగిపోయిన ప్రేమ్... కిషన్ ను ఆకర్షణీయమైన వేశ్య బాబీ (బిపాసా బసు)కి పరిచయం చేస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు.

విడుదల తేదీ: 26 ఆగస్టు 2005 (భారతదేశం)

దర్శకుడు: అనీస్ బాజ్మీ

సీక్వెల్: నో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ

బడ్జెట్: 24 కోట్లు INR

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News