• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వదలనంటున్న ఆ ...

వదలనంటున్న ఆ పాపం..కోర్టుల చుట్టూ బాలీవుడ్ బడా స్టార్!

By - Tupaki Desk
Update: 2020-09-16 05:45 GMT
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను  కృష్ణజింకలను వేటాడిన   కేసు వదలడం లేదు. 22 ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. ఈ కేసు విషయమై పలుసార్లు సల్మాన్ కోర్టు విచారణకు హాజరయ్యాడు. కొద్ది రోజు లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ కేసులో తన సహ నటులు అందరూ బయటపడ్డ  సల్మాన్ మాత్రం ఇప్పటికీ కోర్టుల  వెంట తిరగాల్సి వస్తోంది. ఈనెల 28వ తేదీన సల్మాన్ ఖాన్ మరోసారి రాజస్థాన్లోని జోధ్పూర్ కోర్టుకు కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా  హాజరు కానున్నారు. కోర్టు ఎటువంటి తీర్పు  ఇస్తుంది.. సల్మాన్ భవితవ్యం ఏంటి.. అతడికి అనుకూలం గా తీర్పు వస్తుందా..లేదా లేక పోతే జైలు శిక్ష కన్ఫర్మ్ చేస్తుందా..అని అందరూ ఎదురుచూస్తున్నారు.

1998లో ' హం సాత్ సాత్ హై ' సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సల్మాన్ ఖాన్ ఇతర నటీనటులు సైఫ్ అలీ ఖాన్,  నీలమ్, టబు, సోనాలి బింద్రే  అడవుల్లో కృష్ణ జింకలను, చింకారాలను వేటాడారు. ఈ విషయం బయటికి రావడంతో అప్పట్లోనే కేసు నమోదయింది. అప్పటినుండి ఈ కేసు విచారణ రాజస్థాన్లోని జోధ్పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు నుంచి సైఫ్ అలీ ఖాన్ సహా మిగతా నటీనటులంతా బయట పడగా సల్మాన్ మాత్రం కోర్టు  విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు 2018 ఏప్రిల్ 5న ఐదేళ్ల జైలు శిక్ష పడింది. రెండు రోజులు జైల్లో ఉన్న తర్వాత 2018 ఏప్రిల్ 17న ఆయన కు బెయిల్  వచ్చింది.

ఈ కేసు విచారణ ఇప్పటికీ ముగియక పోవడం తో ఆయన బెయిల్ పైనే  ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జోధ్  పూర్ కోర్టులో ఈ కేసు  విచారణ జరుగనుంది. ఈ కేసు నుంచి ఇప్పటికైనా సల్మాన్ బయట పడతాడా లేదా..లేకపోతే జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇస్తుందా..ఏం జరుగుతుందని అంతా ఎదురు  చూస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS