స్పెషల్: రచయితలకు పంగనామం!?
మోసపోయేవాడు ఉన్నప్పుడు దోచేవాడు ఉంటాడు! సంఘంలో ఈ దోపిడీ రకరకాలుగా ఉంది. ఇది అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే అత్యంత దరిద్రమైన దోపిడీ సినీరంగంలో ఉంది. ఇక్కడ క్రియేటివిటీని కూడా దోపిడీ చేస్తుంటారు కొందరు దర్జా దొంగలు. కథ చెబితే వింటామని అడుగుతారు. ఆ తర్వాత అందులోంచి ఎగ్జయిట్‌మెంట్ పెంచే పాయింట్ దొ(...)స్తారు! కొత్త రచయితల నుంచి ఆ పాయింట్ ని దోపిడీ చేసి ఇంకెక్కడో వాడేస్తారు. ఈ టైపు సీనియర్ దొంగలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారని చాలా సార్లు చాలామంది యువరచయితలు, యువ దర్శకులు వాపోయిన సందర్భాలున్నాయి. పరిశ్రమలో అగ్రదర్శకులే ఈ పని చేశారని వాదించిన యువరచయితలు ఉన్నారు. అయితే ఇలాంటి దరిద్రం వల్ల కూడా పరిశ్రమలో కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నించే రచయితలు పెరగడం లేదన్న వాదనా ఉంది.
అయితే అందరి పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే తనకు మాత్రం అలాంటి గతి పట్టలేదని అన్నారు స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్. ``పరిశ్రమలో ఏనాడూ రచయితగా నాకు చేదు అనుభవాల్లేవు. కొందరు యువరచయితలు తన అనుభవాల్ని నాతో చెబుతుంటారు. సరిగ్గా పారితోషికం ఇవ్వడం లేదని, గుర్తింపు దక్కలేదని చెబుతుంటారు`` అని తెలిపారు. అయితే ఇలాంటి సమస్యకు పరిష్కారం లేదా? అని ప్రశ్నిస్తే.. ``కథకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. కానీ డైలాగ్స్ ని రిజిష్టర్ చేయలేం. కథలు కాపీ కొట్టి వాటిని మార్చేసేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ పాయింట్లు తీసుకుని వేరొక కథలో ఉపయోగించుకునే వీలుంది. అయితే రచయితల సంఘంలో కథల్ని రిజిస్టర్ చేసుకుంటే ఈ సమస్య లేదు. కానీ, డైలాగుల సన్నివేశం వేరు. వేరొక సినిమాల్లోంచి కాపీ కొట్టేది కాదు ఈ వ్యవహారం. ఆ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొంది ఇంకేదైనా కొత్త డైలాగ్ ని రాసేవాళ్లు ఉన్నారు`` అని సాయిమాధవ్ అన్నారు.
అయితే కథలు రిజిస్టర్ చేయించుకునే అవకాశాన్ని యువరచయితలు ఉపయోగించుకోవాలి. దీనికి రచయితల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిటికీ కాపీ రైట్స్ ఉంటాయి. అలాగే సంగీతానికి కూడా హక్కులు కల్పించారు. ఎస్పీబీ వంటి వారు దీనికి ఇనిషియేషన్ తీసుకుని సంగీతదర్శకులు, గాయనీగాయకుల హక్కుల కోసం ప్రత్యేకించి పోరాటం సాగిస్తున్నారు. అయితే రచయితల విషయంలో మాత్రం దోపిడీని ఆపేందుకు హైదరాబాద్ అమీర్ పేట సమీపంలోని ఎల్లారెడ్డి గూడ రచయితల సంఘం ఆఫీస్ ఏం చేస్తోందో మాత్రం ఎవరికీ తెలీదు. ఇక రచయితల సంఘం అధ్యక్షులుగా పరుచూరి సోదరులు ఉన్నారు. అలాగే వందల కోట్ల బిజినెస్ చేసే తెలుగు సినీపరిశ్రమ రచయితల కోసం ఒక వెబ్ సైట్ ఉన్న సంగతే ఎవరికీ తెలీదు. ఇక తెలుగు సినీరైటర్స్ ఆసోసియేషన్ డాట్ కాం అస్సలు ఓపెన్ కానే కాదు. దీనివల్ల సరైన సమాచారం దొరకడం కష్టమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రచయితల సంఘం యాక్టివిటీస్ పై అవేర్ నెస్ పెంచే కార్యక్రమం ఏదీ లేకపోవడం పైనా విమర్శలున్నాయి.