మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయి తేజ్ స్పృహలోకి వచ్చారని.. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
''సినీ హీరో సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్ ను తొలగించారు మరియు సొంతంగానే ఆయన శ్వాస తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులు ఆయన హాస్పిటల్ లోనే కొనసాగుతారు'' అని అపోలో డాక్టర్స్ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
కాగా, సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ - ఐకియా సమీపంలో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ హాస్పిటల్ కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.
అప్పటి నుంచి తేజ్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ లో ఉన్న సాయితేజ్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ని బట్టి చూస్తే త్వరలోనే తేజ్ సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.