లాక్ డౌన్ లో బాలీవుడ్ స్టార్ హీరోలను బీట్ చేసిన యంగ్ రెబల్ స్టార్...!
'బాహుబలి - ది బిగినింగ్' 'బాహుబలి - కన్క్లూజన్' సినిమాలతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ బాగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ కి యావత్ సినీ ఇండస్ట్రీలలో అభిమానులు ఏర్పడ్డారు. అదే ఊపులో గత ఏడాది అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ 'సాహో'లో నటించాడు ప్రభాస్. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా సాహోతో ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరిందని చెప్పవచ్చు. ఆ సినిమా సౌత్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి హిందీలో మాత్రం మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియెన్స్ వరకు అందరిని ఎట్రాక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ రిలీజైన బాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలిచి సాహో అనిపించుకుంది. దీంతో నార్త్ ఇండియాలో కూడా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిపోయింది. ప్రభాస్ సినిమాలను చూడటానికి వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలలో యూట్యూబ్ ఛానళ్లలో సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలను విపరీతంగా చూస్తున్నారు. మన దగ్గర అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25 నుండి మే 1 వరకు టెలికాస్ట్ అయిన సినిమాలకి రేటింగ్స్ ఇచ్చింది బార్క్ అనే సంస్థ.
ఆ సంస్థ అందించిన వివరాల ప్రకారం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోలను బీట్ చేస్తూ తన హవా కొసాగించాడు. వివరాల్లోకి వెళ్తే 'సాహో' హిందీ వెర్షన్ అండ్ పిక్చర్స్ ఛానెల్లో టెలికాస్ట్ అయింది. అత్యధికంగా 83.34 లక్షల ఇంప్రెషన్స్ సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. అంతేకాకుండా సోనీ మాక్స్ ఛానెల్లో టెలికాస్ట్ అయిన 'బాహుబలి - ది బిగినింగ్' హిందీ వెర్షన్ 73.89 లక్షల ఇంప్రెషన్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో ప్రభాస్ నటించిన సినిమాలే ఉండటం విశేషం. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'దర్బార్' హిందీ వెర్షన్ స్టార్ గోల్డ్ లో ప్రసారమై 71.90 లక్షల ఇంప్రెషన్స్ సాధించింది. ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 4' అమితాబచ్చన్ 'సూర్యవంశ్' సినిమాలు 60.18 మరియు 47.73 లక్షల ఇంప్రెషన్స్ తో నిలిచాయి. వీటిని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది మన యంగ్ రెబల్ స్టార్ ని నార్త్ ఆడియన్స్ ఎంతగా అభిమానిస్తారో అని.
కాగా ప్రస్తుతం ప్రభాస్ ప్రతి సినిమాని పాన్ ఇండియా మూవీస్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ - పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం.