మోస‌గాడి ల‌వ‌ర్ మోహిని సంథింగ్ సంథింగ్ గురూ

Update: 2020-10-08 06:30 GMT
మంచు విష్ణు నుంచి హాలీవుడ్ రేంజు సినిమా వ‌స్తోంది.. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ ఇది. హాలీవుడ్ డైరెక్ట‌ర్ జెఫ్రీ జీ చిన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ టైటిల్ `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`. ఇందులో విష్ణుకి సోద‌రిగా చంద‌మామ కాజ‌ల్ న‌టిస్తోంది. సునీల్ శెట్టి విల‌న్ గా న‌టిస్తున్నారు. ఇక విష్ణు ఈ చిత్రంలో అర్జున్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు.

అన్నా చెల్లెళ్లు విష్ణు-కాజ‌ల్ ఏ రేంజు మోస‌గాళ్లో మొన్న రిలీజైన టీజ‌ర్ చూస్తేనే అర్థ‌మైంది. ఇక ట్రైల‌ర్ తో ఎలాంటి దుమారం రేపుతారోన‌న్న క్యూరియాసిటీ నెల‌కొంది. వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ క‌థ‌తో! ఈ మూవీ తెర‌కెక్కుతోంది. నిజ‌ఘ‌ట‌న‌ల క‌థ‌తో ఆస‌క్తిక‌ర సినిమాని రూపొందిస్తున్నార‌ట‌. ఇంత‌కుముందు అర్జున్ లుక్ స‌హా ఇటీవ‌లి టీజ‌ర్ జెట్ స్పీడ్ తో యూత్ లో వైర‌ల్ అయ్యాయి. తెలుగు- ఇంగ్లీష్ స‌హా ప‌లుభాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

తాజాగా ఈ సినిమాలో క‌థానాయిక లుక్ ని రివీల్ చేశారు. అర్జున్ ప్రియురాలిని చూస్తుంటే కార్పొరెట్ గురువుల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించే కిలాడీనే త‌ల‌పిస్తోంది మ‌రి. నామ‌ధేయం రుహి సింగ్. మోస‌గాడితో ప్రేమ‌లో ఎలా ప‌డింది? అన్న‌ది తెర‌పై చూస్తే కానీ తెలీదు.ఇక‌ ఆమెను మోహినిగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇందులో ఏదో మ‌ర్మం దాగి ఉంది. రాత్రి సమయంలో రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్న డిజైనర్ లేడీ రుహి సింగ్ ఎంతో అందంగా మెరిసిపోతోంది.

మోసగల్లు ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. ప్రస్తుతానికి విష్ణు మంచు- కాజల్ అగర్వాల్- సునీల్ శెట్టి- రుహి సింగ్ ల ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు. మునుముందు మ‌రింత‌గా ప్ర‌చారంతో దూసుకొస్తార‌ట‌. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం ప్ల‌స్ కానుంది. అత‌డి రీరికార్డింగ్ అబిలిటీ ఆక‌ట్టుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. షెల్డన్ చౌ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.
Tags:    

Similar News