• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త‌మిళ హీరోకు `ఆర్ ఆర్...

త‌మిళ హీరోకు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ఫిదా!

By - Tupaki Desk
Update: 2022-03-02 13:30 GMT
మాసీవ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డికి సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్ర బృందం ఓ త‌మిళ హీరోకు ఫిదా కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ మార్పుల‌కు కార‌ణంగా నిలిచింది. దీని వ‌ల్ల అనేక రంగాల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే క్ర‌మ క్ర‌మంగా కోలుకుంటోంది. వైర‌స్ భ‌యాల్ని వీడి ప్రేక్ష‌కులు థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టారు.

ఈ నేప‌థ్యంలో ఎంతో కాలంగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న భారీ చిత్రాలు ఒక్కొక్క‌టిగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్నాయి. అయితే సినిమాల రిలీజ్ ల విష‌యంలో మ‌రో సినిమా క్లాష్ కాకుండా మేక‌ర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో పోటీ ప‌డినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు రావ‌డంతో పోటీ ప‌డ‌కుండా ఒక‌రికి ఒక‌రు స‌హ‌కారం అందించుకుంటున్నారు. త‌మ సినిమా కార‌ణంగా మ‌రో సినిమా రిలీజ్ విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కోకూడ‌ద‌ని జాగ్ర‌త్త ప‌డుతున్నారు. దీంతో ఇండ‌స్ట్రీలో ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ యంగ్ హీరో చేసిన ప‌ని `ఆర్ ఆర్ ఆర్` మేక‌ర్స్ ని ఫిదా చేసింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ స‌ద‌రు హీరోపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిగా మారింది. త‌మిళ హీరో శివ‌కార్తీకేయ‌న్ న‌టించిన తాజా చిత్రం `డాన్‌`. ఈ మూవీని మార్చి 25న విడుద‌ల చేయాల‌ని చాలా రోజుల క్రిత‌మే చిత్ర బృందం ప్లాన్ చేసుకుంది.

అయితే అదే రోజు `ఆర్ ఆర్ ఆర్‌` విడుద‌ల కానున్న నేప‌థ్యంలో త‌మ మూవీ రిలీజ్ ని `ఆర్ ఆర్ ఆర్‌` కోసం వాయిదా వేస్తున్న‌ట్టుగా హీరో శివ‌కార్తికేయ‌న్ బుధ‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ ని కూడా అభిమానుల‌తో పంచుకున్నారు. అంతే కాకుండా మా చిత్రాన్ని మే 13న రిలీజ్ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్స్ శివ కార్తికేయ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించింది.

మాపై ప్రేమాభిమానాలు చూపించే వ్య‌క్తుల్లో ముందు వ‌రుస‌లో నిలిచే వ్య‌క్తి శివ కార్తికేయ‌న్ కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ జేస్తున్నామ‌ని అధికారిక సోష‌ల్ మీడియా పేజీ ద్వారా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. శివ కార్తికేయ‌న్ న‌టించిన `రెమో` డాక్ట‌ర్ చిత్రాలు తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే.


He’s always in the first row to support and shower love on us ❤️ Thank you again @Siva_Kartikeyan

Tags:    
  • Sivakarthikeyan 
  • don 
  • doctor 
  • rrr 
  • ramcharan 
  • ntr 
  • rajmouli 
  • tamil 
  • latestnews 

Similar News

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS