పాన్ ఇండియా సినిమా RRR రిలీజ్ పై రకరకాల సందిగ్ధతలు నెలకొన్న సంగతి తెలిసిందే. జక్కన్న టీమ్ ముందే ప్రకటించిన తేదీకి రిలీజ్ చేయడం కష్టమేనా? ఒకవేళ ఆ తేదీకి కుదరకపోతే ప్రత్యామ్నాయంగా మరో తేదీని ఎంచుకున్నారా? అంటే అవుననే ప్రచారమవుతోంది. రామ్ చరణ్- ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని పనులు పూర్తిచేసి జూలై 30న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నది ఓ విశ్లేషణ. ఇప్పటికి 70శాతం పై గా చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతి కావడంతో నిన్నటి వరకూ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో అది కాస్తా బర్డెన్ అనే ఫీలవుతున్నారట.
మరో రెండు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్ యథావిథిగా ప్రారంభించనున్నారు. మార్చి నెలఖరుకి బ్యాలెన్స్ చిత్రీకరణ పూర్తవుతుందని ఇప్పటికే కథనాలు ఉత్సాహాన్ని నింపాయి. అయితే మరోసారి రిలీజ్ వాయిదా సంగతి మీడియని వేడెక్కిస్తోంది. మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి సమయం సరిపోదని... పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుందని జక్కన్న భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో సినిమా దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్రత్యామ్నయంగా మరో రిలీజ్ తేదీని రెడీ చేసుకుంటోందన్న కథనాలు వేడెక్కిస్తున్నాయి.
గతంలో ఈ తరహా రూమర్లు సోషల్ మీడియాలో విరివిగానే షికారు చేశాయి. కానీ ఈసారి దసరా అంటూ కొత్త కథనాలు రావడం అభిమానుల్లో సైతం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా రిలీజ్ వాయిదా పడుతుందా? అంటూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. అభిమానుల్లోనూ దీనిపై సీరియస్ గా చర్చించుకోవడం మొదలైంది. మరి ఈ కథనాలకు చెక్ పెట్టేందుకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఎలాంటి క్లారిటీనిస్తుందో చూడాలి. అధికారికంగా ప్రకటించాకే.. వాయిదా నిజం అని నమ్మాల్సి ఉంటుంది కాబట్టి జస్ట్ వెయిట్..