'ఆర్ఆర్ఆర్'కి అలియా పెద్ద దెబ్బ.. షాక్ లో చిత్రయూనిట్!
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలన్ని సినీ ప్రేక్షకుల ముందుంచింది. దశాబ్దాలుగా నెపోటిజంతో ప్రతిభ గల నటులకు అవకాశాలు దక్కకుండా అణగదొక్కుతారన్న విషయం మరోసారి స్పష్టమైనట్లే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో రోజురోజుకి భిన్నాభిప్రాయాలు రేకెత్తుతూనే ఉన్నాయి. బాలీవుడ్‌లోని కొందరు పెద్దలు.. పెత్తనం చలాయించి సుశాంత్ కెరీర్‌ను నాశనం చేయడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా సుశాంత్ మరణాన్ని బిహారీ రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దీనికి కారణమైన వారి సినిమాలను బీహార్‌లో బ్యాన్ చేయాలని వారు నిర్ణయించుకున్నారని సమాచారం.
ముఖ్యంగా సుశాంత్ మృతికి ఇండస్ట్రీ ప్రముఖులైన కరణ్ జోహార్.. సల్మాన్ ఖాన్.. అలియా భట్.. సంజయ్ లీలా భన్సాలీ.. ఏక్తా కపూర్‌లు కారణమని ఇటీవల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బిహారీలు వీరి దిష్టిబొమ్మలు సైతం దగ్ధం చేశారట. తాజాగా పాట్నావాసులు ఈ బాలీవుడ్ ప్రముఖుల చిత్రాలను తమ రాష్ట్రంలో నిషేధించే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీహార్‌లోని ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా.. 8 మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్‌ను ఆత్మహత్యకు పురికొల్పారని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సినీ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ వారి సరసన నటిస్తున్నారు. అయితే అలియా భట్ సినిమాలు బీహార్ రాష్ట్రంలో విడుదల కానివ్వమని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కంగారు పడుతుందట. బీహార్ ప్రజలు తెలుగు సినిమాలను కూడా ఆదరిస్తారు. ఇప్పుడు ఇలా అలియా సినిమాలు బ్యాన్ చేస్తారనే సరికి బీహార్ రాష్ట్రములో ఆర్ఆర్ఆర్ కూడా విడుదల అయ్యే అవకాశం లేదు. అలియా వలన బీహార్ మార్కెట్ లాస్ వస్తుందని చిత్రయూనిట్ వాపోతున్నారట. చూడాలి మరి రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏమైనా మార్పులు కనిపిస్తాయేమో..!