శోభితా శీర్ శారీ లుక్ వైరల్.. నెటిజన్లు ఫిదా!

తెలుగు భామ, వర్సటైల్ యాక్ట్రెస్ శోభితా ధూళిపాళ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె నటనతో కాకుండా, తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

Update: 2026-08-06 08:09 GMT

తెలుగు భామ, వర్సటైల్ యాక్ట్రెస్ శోభితా ధూళిపాళ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె నటనతో కాకుండా, తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇండియా కూతుర్ ఫ్యాషన్ వీక్ 2026లో డిజైనర్ రాహుల్ మిశ్రా కోసం 'దేవి' అవతారంలో మెరిసిన ఆమె, తాజాగా ఆ ఈవెంట్‌కు సంబంధించిన సరికొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..




ఐవరీ శారీలో రాయల్ లుక్:

శోభితా ధూళిపాళ షేర్ చేసిన ఫోటోల్లో ఐవరీ కలర్ లేస్ శారీ, దానికి మ్యాచింగ్ నెట్ పల్లూ ధరించి కనిపించారు. ఇక దీనికి కాంబినేషన్‌గా మెడలో ఎమరాల్డ్ (పచ్చల) చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరియు సాఫ్ట్ కర్లీ హెయిర్ స్టైల్‌తో వేదికపై దేవకన్యలా మెరిసిపోయారు. ఈ రాయల్ అండ్ క్లాసీ లుక్ ఆమెకు మరింత గ్లామర్‌ను తెచ్చిపెట్టింది.




కలర్‌ఫుల్ అండ్ డ్రీమీ ఫోటోషూట్:

కొత్తగా షేర్ చేసిన పిక్స్‌లో శోభిత ఎంతో ఆనందంగా తిరుగుతూ పొజులిచ్చారు. ఆమె సారీ దుపట్టా గాలిలో తేలుతున్నట్లు ఉన్న ఫోటోలు డ్రీమీ అనుభూతిని ఇస్తున్నాయి. ఇక మినిమల్ మేకప్‌తోఇంట్రీకేట్ లేస్ వర్క్ మరియు జ్యువెలరీకి ప్రాధాన్యత ఇస్తూ ఆమె చేసిన ఈ ఫ్యాషన్ వాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యాషన్ వీక్‌లోనే శోభితా బెస్ట్ లుక్ ఇదంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పొలిటికల్ కామెంట్స్‌తో ట్రెండింగ్:

ఒకవైపు ఫ్యాషన్ లుక్‌తో అలరిస్తూనే, మరోవైపు శోభిత పాత ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి నెట్టింట మళ్లీ వైరల్ కావడంతో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇక గతంలో తాను లెఫ్ట్-లీనింగ్ లిబరల్ అని, భవిష్యత్తులో కమ్యూనిజం విజయం సాధిస్తుందని నమ్ముతానని చెప్పిన వ్యాఖ్యల క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక దీనిపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ చర్చ నడుస్తోంది.

ఫ్యాషన్ ఐకాన్‌గా మరో ముద్ర:

రాహుల్ మిశ్రా కాన్సెప్ట్ డ్రెస్‌లో రాంప్ వాక్ చేసిన శోభితా, ఈ ఫ్యాషన్ షో ద్వారా తన ప్రతిభను, గ్లామర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభితా, ఫ్యాషన్ ప్రపంచంలోనూ మోస్ట్ వాచ్డ్ స్టైల్ ఐకాన్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.

శోభితా మేజిక్‌కి నెటిజన్లు క్లీన్ బౌల్డ్:

అటు రాజకీయం, ఇటు ఫ్యాషన్ రెంటిలోనూ వార్తల్లో నిలుస్తున్న శోభితా ధూళిపాళ, తన నయా శారీ లుక్‌తో మాత్రం కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు విపరీతంగా షేర్ అవుతూ లైకుల సునామీ సృష్టిస్తున్నాయి.

Tags:    

Similar News