'రౌడీ బేబీ' మరో 'నిశబ్దం' అవ్వదు కదా..!
ప్రముఖ రచయిత కోన వెంకట్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో చిత్రాలకు కథ కథనం మాటలు అందించి సక్సెస్ అయిన కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు చేయలేకపోయాడు. కోన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన 'నిశబ్దం' సినిమా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ అనుష్క - మాధవన్ - అంజలి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. ఈ క్రమంలో ఇప్పుడు కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో 'రౌడీ బేబీ' అనే సినిమా రూపొందిస్తున్నారు.
యువ హీరో సందీప్ కిషన్ - 'మెహబూబా' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న ‘రౌడీ బేబి’ చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. ఇందులో రాజేంద్రప్రసాద్ - బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే 'నిశబ్దం' సినిమా తరువాత కోన వెంకట్ హవా ఇండస్ట్రీలో తగ్గిపోయింది అనడానికి నిదర్శనమే ఈ ప్రాజెక్ట్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు మాదిరి కోన వెంకట్ ని స్టార్స్ ఎవ్వరూ ఎంకరేజ్ చేయడం లేదని టాక్ నడుస్తోంది. ఏదేమైనా 'రౌడీ బేబి' మరో 'నిశబ్దం' లా అవకుండా ఉంటే చాలని కామెంట్స్ చేస్తున్నారు.