20 ఏళ్లుగా చూస్తున్నా.. అలాంటి వాడు కాదు : వర్మ
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేదించాడంటూ హీరోయిన్ పాయల్ చేసిన మీటూ ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పాయల్ కు ఇప్పటికే కంగనా మద్దతు పలికింది. ఈ విషయాన్ని జాతీయ మహిళ కమీషన్ వద్దకు తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ తనను అనవసరంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు తన గురించి ఎలాంటి విమర్శలు రాలేదు. కాని మొదటి సారి మీటూ ఆరోపణలు రావడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాడు. ఈ సమయంలో ఆయనకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు.
తాప్సి మాట్లాడుతూ అనురాగ్ కశ్యప్ పై ఆ రోపణలు నిజం కాదని నేను భావిస్తున్నాను అంది. ఇక వర్మ ట్విట్టర్ లో అనురాగ్ కశ్యప్ ను నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన చాలా సున్నిత మనస్కుడు. ఎవరిని కూడా బాధపెట్టే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని బాధ పెట్టిన సందర్బాలు లేవు. కనుక ప్రస్తుతం ఆయన గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదేమో అని తాను నమ్ముతున్నట్లుగా ట్వీట్ చేశాడు. వర్మ ను ఈ విషయంలో చాలా మంది సమర్థిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ వంటి ఒక మంచి దర్శకుడిపై ఆరోపణలు చేసిన సమయంలో అంతా ఆయనకు మద్దతుగా నిలవాలంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Full View Full View