పవన్ కు మార్కులేసిన రేణు దేశాయ్

Update: 2017-03-05 10:58 GMT
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది రేణూ. ఈ ఇంటర్వ్యూలో బోలెడన్ని ప్రశ్నలకు టకాటకా ఆన్సర్స్ ఇచ్చేయగా.. వాటిలో ఎక్కువ శాతం పవన్ తో లింక్ అయి ఉన్నవే కావడం విశేషం.

తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం మిలాన్ అని చెప్పిన రేణూ దేశాయ్.. బాలు సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్ తో కలిసి తిరిగినట్లు చెప్పింది. తాను ఎంతో త్వరగా నిర్ణయాలు తీసుకుంటానని.. తన జీవితంలో పెళ్లి చేసుకోవడం అతి తొందరపాటు నిర్ణయంగా చెప్పింది రేణూ దేశాయ్. ఒక భర్తగా అయితే పవన్ కు 4-5 మార్కులే వేస్తానని చెప్పిన ఈ మాజీ వైఫ్.. తండ్రిగా అయితే పదికి వంద మార్కులు వేస్తానంది. ఫిలిం యాక్టర్ గా పదికి పది.. పొలీటీషియన్ గానూ పదికి పది మార్కులు వేస్తానంది.

కొడుకు అకీరాతో పవన్ సినిమాల్లో ఏదో ఒకదాన్ని రీమేక్ చేయాల్సి వస్తే.. ఖుషీ మూవీని ఎంచుకుంటానని చెప్పింది రేణూ. అయితే.. పవన్ సినిమాల్లోంచి ఒకటి తను రీమేక్ చేస్తే మాత్రం జానీ మూవీని ఎంచుకుంటానని.. ఒరిజినల్ స్టోరీ వేరన్న ఆమె.. మేకింగ్ లో కమర్షియల్ వేల్యూస్ కోసం కథను చాలా మార్చేయాల్సి వచ్చిందని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News