చరణ్ - ఎన్టీఆర్ లనే రాజమౌళి ఎందుకు తీసుకున్నాడు?
బాహుబలి లాంటి ప్రపంచం గర్వించే సినిమా తీశాక రాజమౌళి నుంచి జాలువారుతున్న మరో మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లను ఒక్క గాటిన పట్టి రాజమౌళి తీస్తున్న ఈ అద్భుతమైన మూవీ కోసం ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తోంది.
టాలీవుడ్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న నందమూరి, మెగా ఫ్యామిలీలను కలపడం ద్వారా రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను ఎంపిక చేసుకోవడం.. అదీ ఎన్టీఆర్, రాంచరణ్ లే ఎందుకు అయ్యారన్న ప్రశ్నకు తాజాగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఎన్టీఆర్ తో గతంలో మూడు సినిమాలు చేశానని.. రాంచరణ్ తో మగధీర తీశానని రాజమౌళి తెలిపారు. కాబట్టి వీరి పనివిధానం.. వర్క్ కంఫర్ట్ గా ఉంటుందనే వీరిద్దరినీ ఎంపిక చేశానని రాజమౌళి వివరించారు.
ఇక వీరిద్దరినీ ఎంపిక చేసుకోవడానికి మరో కారణం.. టాలీవుడ్ స్టార్ హీరోలలో వీరిద్దరూ మంచి మిత్రులని రాజమౌళి తెలిపారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా పండుతుందనే వారిద్దరిని హీరోలుగా తీసుకున్నానని రాజమౌళి చెప్పుకొచ్చాడు.