పవన్ వేలు పెట్టింది అందుకే

Update: 2018-05-22 16:33 GMT
సినిమా హీరోలు కలుసుకోవడమే ఒక సెన్సేషన్ అయితే వారు సరదాగా కలిసి చేసే పనులు కూడా మరింత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాయి. ఇక మీడియాలో ఆ న్యూస్ వైరల్ అవ్వడం కామన్. అలాగే మొన్న నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో కూడా పవన్ - రవి తేజకు సంబందించిన ఓకే వీడియో చూసి కొంత మంది ట్రాల్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఎదో ఫ్రెండ్లిగా చేసినా అదో పెద్ద పొరపాటు అన్నట్టు కొందరు కామెంట్స్ చేయడం వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఆ విషయంపై హీరో రవితేజ ఇటీవల స్పందించారు. నేల టిక్కెట్టు సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి మాట్లాడే సమయంలో ఆ ప్రస్తావన రాగా.. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నా ప్యాంట్ ను తాకడం ట్రాల్ అయింది. ప్యాంట్ బొక్కలో వేలు పెట్టడం అనటం కరెక్ట్ కాదు. టోన్డ్ జీన్స్ వేసుకోవడం వలన అది పవన్ ని ఎట్రాక్ట్ చేసింది. ఇక సరదా కోసం జీన్స్ ను తాకారు. ఇక పట్టుకొని లాగడంతో దాన్ని ఫొటో తీసి ట్రాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయినా ఎవరు ఏమనుకుంటే ఏంటి.. అని మాస్ రాజా తన వివరణను ఇచ్చాడు.

అలాగే పవన్ చాలా సరదాగా ఉంటారని. ఎదో సరదా కోసం చేసిన దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదని రవితేజ చెప్పకనే చేప్పేశాడు. ప్రస్తుతం నేల టిక్కట్టు ప్రమోషన్స్ చిత్ర యూనిట్ కలిసి కట్టుగా నిర్వహిస్తోంది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మాళవిక హీరోయిన్ గా నటించింది.

 
Tags:    

Similar News