• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప'లో ఆమె...

'పుష్ప'లో ఆమె నటవిశ్వరూపాన్ని చూడబోతున్నామా...?

By - Tupaki Desk
Update: 2020-04-21 21:30 GMT
అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా 'పుష్ప‌' తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ లుక్ తో బన్నీ క్యారక్టర్ ఏంటనేది ఒక ఐడియా వచ్చాక.. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర ఏ విధంగా చేయబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘పుష్ప’లో తన పాత్ర అద్భుతంగా ఉండబోతుందని.. తన కెరీర్‌లోనే పుష్ప సినిమా ఎప్పటికి నిలిచిపోతుందని.. ప్రధానంగా ఈ సినిమా ద్వారా తన నటనలోని మరో కోణం బయటికి వస్తుందని రష్మిక చెప్పుకొచ్చిందట. వాస్తవానికి సుకుమార్ ఫస్ట్ సినిమా నుండి కూడా తన సినిమాల్లో హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ గర్ల్ అని కాకుండా స్టోరీలో ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్ అనేలా ఉంటుంది. సుక్కు గత చిత్రం 'రంగస్థలం'లో కూడా రామలక్ష్మిగా సమంతను ఆయన చూపించిన విధానం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటనకి ఎన్నో ప్రశంసలు.. అవార్డులు తెచ్చి పెట్టింది రామలక్ష్మి పాత్ర. ఇప్పుడు 'పుష్ప'లో కూడా మరో కొత్త క్యారెక్టర్ రష్మిక కోసం సుక్కు సెట్ చేసాడని అర్థమవుతోంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అందుకే స్టార్ కాస్ట్ ను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారట. సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట. అంతేకాకుండా విలన్ రోల్ కోసం సునీల్‌ శెట్టి అయితే బాగుంటుందని సుకుమార్ అనుకుంటున్నాడట. 'రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్.. 'పుష్ప' సినిమాతో కూడా హిట్ కొడతాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Tags:    
  • Rashmika Mandanna To Give A Tough Competition To Allu Arjun In Pushpa 
  • Allu Arjun Birthday Gift Pushpa 
  • Allu Arjun Pushpa Movie First Look 
  • Stylish Star 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS