ప్రభాస్ కోసం కన్నడ భామ??

Update: 2017-03-14 05:37 GMT
ఎట్టకేలకు బాహుబలి మూవీ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. బాహుబలి పాత్ర కోసం పెంచిన భారీ దేహాన్ని తగ్గించుకునే పనిలో ఉన్న ప్రభాస్.. మరికొన్ని రోజుల్లోనే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీని ప్రారంభించేయనున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలామందినే ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా ఎవరూ సెట్ కాలేదు. రకరకాల ఆప్షన్స్ చూసిన తర్వాత.. కన్నడ లేటెస్ట్ స్టార్ రష్మిక మందనా దగ్గర వీళ్ల సెర్చింగ్ ఆగినట్లు తెలుస్తోంది. గతేడాది వచ్చిన కిరాక్ పార్టీ మూవీతో స్టార్ ఇమేజ్  సంపాదించుకున్న రష్మిక.. ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్.. గణేష్ లాంటి స్టార్లతో నటించేస్తోంది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి.. క్రేజీ ఆఫర్లు ఈమె చెంతకు చేరుతున్నాయి.

యంగ్ హీరో నాగశౌర్య నిర్మాతగా మారి.. తన సినిమాను తనే నిర్మించుకుంటున్నాడు. ఈ సినిమాతో రష్మికను టాలీవుడ్ లోకి తెచ్చేయాలని చూస్తున్నాడు. మరోవైపు నాని- దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలోను.. రామ్ తో కిషోర్ తిరుమల చేయనన్న సినిమాలోను.. ఈ రష్మికనే హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో రష్మిక టైమ్స్ స్టార్ట్ అయిపోయినట్లు లేదూ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News