అన్నీ ఫ్రీ అంటే ఎలారా ఖన్నా ?

Update: 2015-08-03 16:17 GMT
హీరో హీరోయిన్స్ అంటే... కమర్షియల్ కి మరోపేరు అన్నట్లుగా ఉంటుంది మనోళ్ల వసూళ్ల వ్యవహారం. కాలు కదిలితే కాసులు కుమ్మరించాలి. రిబ్బన్ కట్ చేస్తే ఖాతాల్లో జమచేయాలి. ఒకరిద్దరు ఏమైనా కాస్త తక్కువ తీసుకుంటారేమో కానీ... మిగతావాళ్లంతా వసూల్ రాజా, కలెక్షన్ రాణీ అన్నట్లుగానే ఉంటారు. కానీ.. ఒక హీరోయిన్ పద్ధతి మాత్రం విచిత్రంగా ఉంది.

పైసా ఇవ్వకపోయినా సరే... పిలిస్తే చాలు వచ్చేస్తోంది రాశి ఖన్నా. ఆడియో ఫంక్షన్లు, అవార్డ్ ఫంక్షన్లు.. ఇలాంటి సందడి జరిగేపుడు హీరోయిన్ల ను పిలిచి హంగామా చేయడం బాగా అలవాటు. ఇలా పిలిచినప్పుడు వాళ్లు రావాలంటే దండిగానే ముట్టచెప్పాల్సి ఉంటుంది. కానీ రాశిఖన్నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదు. ఆఖరికి మేకప్, డ్రస్ ఖర్చులు కూడా తానే పెట్టుకుంటోందట.

మరీ ఇంత ఉదారంగా ఉంటే ఎలా అంటున్నారు రాశిఖన్నా శ్రేయోభిలాషులు. మరీ కాజల్ రేంజ్ లో పిండుకోకపోయినా... కాస్త సమంత మాదిరిగా అయినా జాగ్రత్త పడాలిగా అంటూ సుద్దులు చెబ్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్ లక్షణాలున్న రాశి ఖన్నా... వీటికి సానుకూలంగా స్పందిస్తుందో? లేక నేనింతే.. నాపద్ధతింతే అంటుందో...!
Tags:    

Similar News