ఆయ‌న‌ అర్జున్ రెడ్డి అయితే ఈయ‌న‌ ఇస్మార్ట్ శంకరా?

Update: 2020-10-06 06:00 GMT
ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ న‌టించిన మాస్ మ‌సాలా ఎంట‌ర్ ‌టైన‌ర్ `ఇస్మార్ట్ శంక‌ర్`. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం హీరో రామ్ ‌కు.. ద‌ర్శ‌కుడిగా పూరీకి తిరుగులేని విజ‌యాన్ని అందించింది. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు పూరిని మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

ఈ మూవీ ద్వారా న‌భా న‌టేష్‌.. నిధి అగ‌ర్వాల్ కూడా ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం తెలుగు చిత్రాల‌ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న నేప‌థ్యంలో బాలీవుడ్ నిర్మాత‌ల క‌న్ను `ఇస్మార్ట్ శంక‌ర్‌`పై ప‌డింది. ఓ భారీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. రామ్ పాత్ర‌లో ర‌ణ్ ‌వీర్ సింగ్ ‌ని సెలెక్ట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

ఇప్ప‌‌టికే ర‌ణ్ ‌వీర్ ‌తో మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని త్వ‌ర‌లోనే ఆయ‌న నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే చిత్ర బృందం అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాత్ర‌లో రామ్ ఫుల్ ఎన‌ర్జీతో న‌టించిన విష‌యం తెలిసిందే. అంత‌కు మించిన ఎన‌ర్జీతో ఈ పాత్ర‌ని పండించాలంటే ఒక్క ర‌ణ్ ‌వీర్ వ‌ల్లే అవుతుంద‌ని మేక‌ర్స్ బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. ఇంత‌కుముందు షాహిద్ క‌పూర్ కి అర్జున్ రెడ్డి రీమేక్ (కబీర్ సింగ్) ఆఫ‌ర్ త‌గిలితే ఇప్పుడు ఎన‌ర్జిటిక్ ర‌ణ్ వీర్ కి ఇస్మార్ట్ శంక‌ర్ లో న‌టించే రేర్ ఛాన్స్ ద‌క్కింద‌న్న‌మాట‌. షాహిద్ క‌పూర్ పెద్ద స‌క్సెస‌య్యాడు. అర్జున్ కి ఈ రేర్ ఛాన్స్ ద‌క్కితే నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News